ట్యురిన్(ఇటలీ) : జానిక్ సిన్నర్ ఎటీపీ ఫైనల్స్‌లో టైటిల్ పోరుకు చేరుకున్నాడు. శనివారం జరిగిన సెమీస్‌లో సిన్నర్ 6-3, 6-7(4), 6-1తో డేనియల్ మెద్వెద్పై గెలుపొందాడు. టాప్ ఎనిమిది ర్యాంకుల్లోని ఆటగాళ్లు పోటీపడే ఈ టోర్నీలో సిన్నర్ టైటిల్ పోరులో నొవాక్ జొకోవిచ్-కార్లోస్ అల్కారజ్ల మధ్య విజేతతో తలపడతాడు.
ఈ టోర్నీలో ఆడిన నాలుగు లీగ్ మ్యాచ్‌లలో సిన్నర్ విజయాలు నమోదు చేశాడు. కాగా అంతకుముందు జరిగిన చివరి లీగ్ పోటీలో అల్కారజ్ 6-4, 6-4తో డేనియల్ మెద్వెదెవ్పై గెలుపొంది టాప్ ర్యాంకర్ జొకోవిచ్‌తో సెమీస్ పోరుకు సిద్ధమయ్యాడు.