మాసన్(యూఎస్ఏ): యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సన్నాహకమైన సిన్సినాటీ ఓపెన్‌లో టాప్ ర్యాంకర్ జానిక్ సిన్నర్ టైటిల్ విజేతగా నిలిచాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తుది పోరులో సిన్నర్ 7-6(4), 6-2తో ఫ్రాన్సెస్ టియాఫీపై అలవోక విజయం సాధించాడు. అండీ ముర్రే(21 ఏండ్లు) తర్వాత పిన్న వయసులో టైటిల్ గెలిచిన రెండో ప్లేయర్‌గా సిన్నర్(23 ఏండ్లు) నిలిచాడు. మరోవైపు మహిళల సింగిల్స్ తుదిపోరులో అర్యనా సబలెంకా 6-3, 7-5తో జెస్సికా ఫెగులాపై గెలిచి తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది. భుజం గాయం కారణంగా వింబుల్డన్‌కు దూరమైన సబలెంకా.. ఈ విజయంతో యూఎస్ ఓపెన్‌లో టైటిల్ ఫెవరేట్‌గా పోటీపడనుంది.