James Anderson | ఆ భారత పేసర్ నాకు స్ఫూర్తి.. వరల్డ్ క్లాస్ బౌలర్ అతడే
James Anderson: ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson) 41 ఏండ్ల వయసులోనూ సత్తా చాటుతున్నాడు. భారత పర్యటన(India Tour)లో కుర్ర పేసర్లకు దీటుగా వికెట్లు పడగొడుతున్నాడు. 700ల క్లబ్లో చేరేందుకు రెండు వికెట్ల దూరంలో ఉన్న అండర్సన్ తాజా...
James Anderson: ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson) 41 ఏండ్ల వయసులోనూ సత్తా చాటుతున్నాడు. భారత పర్యటన(India Tour)లో కుర్ర పేసర్లకు దీటుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. లేటు వయసులోనూ ఫిట్నెస్ కాపాడుకుంటూ మైదానంలో మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. 700ల క్లబ్లో చేరేందుకు రెండు వికెట్ల దూరంలో ఉన్న అండర్సన్ తాజాగా సంచలన విషయం చెప్పాడు. తనకు భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్(Zaheer Khan) స్ఫూర్తి అని జిమ్మీ అన్నాడు.
‘బౌలర్లలో నాకు జహీర్ ఖాన్ స్ఫూర్తి. అతడి బౌలింగ్ వీడియోలను ఇప్పటికీ చూస్తాను. అతడు రివర్స్ సింగ్ ఎలా చేస్తాడు? రనప్ పూర్తి చేసే సమయంలో అతడు బంతిని ఎలా దాచిపెడతాడు? వంటివి బాగా గమనించేవాడిని. జహీర్లా బౌలింగ్ చేయడం నేర్చుకొని, భారత పర్యటనలో అచ్చం తనలా బౌలింగ్ చేసేవాడిని’ అని అండర్సన్ వెల్లడించాడు.
బుమ్రా, అండర్సన్

బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్
అంతేకాదు భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)పై జిమ్మీ ప్రశంసలు కురింపించాడు. అతడు వరల్డ్ క్లాస్ బౌలర్ అని అండర్సన్ అన్నాడు. ‘భారత్‌లో రివర్స్ స్వింగ్ ఎంతో కీలకం. రివర్స్ స్వింగ్‌లో బుమ్రా దిట్ట. అతడి పేస్, కచ్చితత్వం బాగుంటుంది. పైగా నిలకడగా రాణిస్తాడు. వైజాగ్ టెస్టులో ఓలీ పోప్‌ను బౌల్డ్ చేసిన యార్కర్ ఒక అద్బుతం. అందుకనే బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్’ అని అండర్సన్ వెల్లడించాడు.

2003లో మొదలు..
అండర్సన్ టెస్టు కెరీర్ జహీర్ ఖాన్ కంటే మూండేండ్ల తర్వాత అంటే.. 2003లో మొదలైంది. టీమిండియా గొప్ప పేసర్‌గా కీర్తి గడించిన జహీర్ 2014లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటికీ అతడి ఖాతాలో 600 వికెట్లు ఉన్నాయి. ప్రస్తుతం అండర్సన్ 698 వికెట్లు పడగొట్టాడు. భారత్‌తో జరిగే ఆఖరి టెస్టులో అతడు 700 వికెట్ల క్లబ్‌లే చేరే చాన్స్ ఉంది. ఇండియా, ఇంగ్లండ్‌ల మధ్య నామమాత్రమైన ఐదో టెస్టు మార్చి 7న ధర్మశాలలో ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి
- Deepika Padukone | తల్లి కాబోతున్న దీపికా పదుకొణె.. సెప్టెంబర్‌లో డెలివరీ
- Paris Olympics 2024 | మండుటెండల్లో ఒలింపిక్స్.. అయినా అథ్లెట్ల గదుల్లో నో ఏసీ.. ఎందుకంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

