PKL 2025 : ప్రో కబడ్డీ లీగ్ పదకొండో సీజన్ ఛాంపియన్ హర్యానా స్టీలర్స్ (Haryana Steelers)మరో టైటిల్ కోసం పక్కాగా సన్నద్ధమవుతోంది. 12వ సీజన్లోనూ ట్రోఫీతో చరిత్ర సృష్టించాలనుకుంటున్న హర్యానా ఫ్రాంచైజీ సూపర్ డిఫెండర్ జైదీప్ దహియా (Jaideep Dahiya)కు మరోసారి కెప్టెన్సీ అప్పగించింది. తొలిసారి తమ జట్టు పీకేఎల్ విజేతగా అవతరించడంలో కీలక పాత్ర పోషించిన దహియాకు.. రాహుల్ సేథ్‌పాల్ వైస్ కెప్టెన్‌గా ఉంటాడని యాజమాన్యం తెలిపింది. మ్యాచ్ సమయంలో వేగంగా, తెలివిగా నిర్ణయాలు తీసుకోగల నైపుణ్యం ఉన్నందున ఈ ఇద్దరిని ఎంపకి చేశామని కోచ్ మన్‌ప్రీత్ సింగ్ వెల్లడించాడు.
‘కబడ్డీ ఆటలో ఐకమత్యంతో పాటు వేగంగా నిర్ణయం తీసుకునే నేర్పూ ఉండాలి. జైదీప్, రాహుల్‌కు ఈ రెండు నైపుణ్యాలు ఉన్నాయి. ఇద్దరూ మ్యాట్ మీద ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేయడంలో ఇద్దరు ది బెస్ట్. క్రమశిక్షణ, నిలకడ.. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి గత సీజన్లో మా జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో జైదీప్, రాహుల్ కీలక పాత్ర పోషించారు. ఈ ఏడాది కూడా మేము టైటిల్‌పై కన్నేశాం’ అని కోచ్ మన్ప్రత్ సింగ్ అన్నాడు.
Jaideep Dahiya will captain Haryana Steelers in PKL Season 12! 💙 pic.twitter.com/DWvjAQ6hhe
— Sports Universe (@SportsUniv7) August 18, 2025
పీకేఎల్ స్టార్ అయిన జైదీప్ దహియా హర్యానా జట్టుకు కొన్నాళ్లుగా ఆడుతున్నాడు. 87 మ్యాచుల్లో 231 రైడ్ పాయింట్లు సాధించిన దహియా.. డిఫెన్స్‌లోనూ సత్తా చాటి 227 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. రాహుల్ కూడా హర్యానా బెస్ట్ ప్లేయర్. గత సీజన్లో అతడు 24 మ్యాచుల్లో 73 టాకిల్ పాయింట్లతో రాణించాడు.
‘The Wall’ Rahul Sethpal remains the vice-captain of Haryana Steelers’ in PKL 12 🔥#PKL | #PKL12 | #ProKabaddiLeague | #Kabaddi | #PKLSeason12 | #ProKabaddi | #HaryanaSteelers pic.twitter.com/OY73HM0sz2
— Khel Kabaddi (@KhelNowKabaddi) August 18, 2025
రైడర్స్ : నవీన్ కుమార్, శివం పతారే, వినయ్ తెవాటియా, షాహన్ షా మహమ్మద్, ఘనశ్యామ్ రొకా మగర్, మయాంక్ సైనీ, జయసూర్య ఎన్ఎస్, విశాల్ తటే, వికాస్ జాదవ్. ఢిఫెండర్లు : జైదీప్ దహియా, రాహుల్ సేథ్పల్, రాహుల్ అహ్రి, రితికా గుర్జర్, జుబైర్ మాలిక్, హర్దీప్ కండోలా, అంకిత్ ధుల్, సచిన్ దహియా, ఎన్ మణికందన్. ఆల్‌రౌండర్లు : అశిష్ నర్వాల్, సహిల్ నర్వాల్.
పీకేఎల్ తొలి టైటిల్‌తో హర్యానా ఆటగాళ్లు
ప్రో కబడ్డీ లీగ్-11వ సీజన్ టైటిల్‌ను హర్యానా స్టీలర్స్ తొలిసారి దక్కించుకుంది. సీజన్ ఆరంభం నుంచి టేబుల్ టాపర్‌గా ఉంటూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఫైనల్ చేరిన ఆ జట్టు.. టైటిల్ పోరులో 32-23తో పాట్నా పైరేట్స్‌ను మట్టికరిపించింది. గతేడాది ఫైనల్లో పూణెరి పల్టన్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన హర్యానా ఈసారి మాత్రం పట్టు విడవకుండా టోర్నీ ఆసాంతం అదరగొట్టి తమ కప్ కలను సాకారం చేసుకుంది. తొలి అర్థ భాగం ముగిసేసరికి 15-12తో ఆధిక్యంలో ఉన్న హర్యానా.. సెకండాఫ్‌లో మరింత జోరు పెంచింది. హర్యానా తరఫున రైడర్ శివమ్ పటారె 9 పాయింట్లతో సత్తా చాటగా ఆల్‌రౌండర్ షాద్లోయ్ (7), వినయ్ (6) ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.