HCA Elections | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా జగన్ మోహన్ రావు (యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ HCA ప్యానెల్) విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ గా దళ్జిత్ సింగ్ (గుడ్ గవర్నెన్స్ ప్యానేల్), సెక్రటరీగా దేవరాజు (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్), జాయింట్ సెక్రటరీగా బసవరాజు (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్), ట్రెజరర్‌గా సీజే శ్రీనివాస్ రావు (యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ HCA ప్యానెల్), కౌన్సిలర్‌గా సునీల్ అగర్వాల్ (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్) విజయం సాధించారు. జగన్ మోహన్ రావు ఒక్క ఓటుతో హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు.
శుక్రవారం ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. మొత్తం 173 మంది ఓట్లు ఉండగా, 169 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్ పదవులకు ఎన్నికలు జరిగాయి.
యూనైటెడ్ మెంబర్స్ ౠఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ పేరుమీద బరిలోకి దిగిన జగన్మోహన్ రావు.. తన సమీప ప్రత్యర్థి, క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ నుంచి అధ్యక్ష బరిలో ఉన్న అమర్నాథ్పై ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. హెచ్‌సీఏలో 169 ఓట్లు పోల్ కాగా.. జగన్మోహన్ రావుకు 63 ఓట్లు, అమర్నాథ్కు 62 ఓట్లు దక్కాయి. గుడ్ గవర్నెన్స్ నుంచి బరిలో ఉన్న కె.అనిల్ కుమార్‌కు 10, ఆనెస్ట్ హార్డ్ వర్కింగ్ హెచ్‌సీఏ ప్యానెల్ తరఫున పోటీపడిన పీఎల్ శ్రీనివాస్‌కు 34 ఓట్లు వచ్చాయి.