Guwahati Test : సిరీస్‌లో కీలకమైన గువాహటి టెస్టు (Guwahati Test) ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఐదో రోజు భారత బ్యాటర్లు క్రీజులో నిలుస్తారా? మ్యాచ్ అప్పగిస్తారా? అనేది ఆసక్తి రేపుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 201కే కుప్పకూలిన టీమిండియా.. 549 పరుగుల ఛేదనలో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు నిరాశపరిచిన వేళ డ్రా కూడా అసాధ్యమనిపిస్తోంది. అయితే.. నాలుగో రోజు ఆట ముగిశాక రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మాట్లాడుతూ తాము ఈ టెస్టు డ్రా చేసుకున్నా సరే గెలిచినట్టేనని అన్నాడు.
గువాహటి టెస్టులో బౌలర్లు, బ్యాటర్లు తేలిపోవడంతో భారత జట్టు ఓటమి అంచున నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో సైతం 21కే ఓపెనర్లు డగౌట్ చేరడంతో వైట్‌వాష్ తప్పించుకోవాలంటే.. మిడిలార్డర్, టెయిలెండర్లు అద్భుతం చేయాలి. కానీ.. సఫారీ పేసర్ జాన్సెన్, స్పిన్నర్లు హార్మర్, మహరాజ్‌లను దీటుగా ఎదుర్కోవడం మనోళ్లకు శక్తికి మించినపనే. అయితే.. తాము సిరీస్ కాపాడుకుంటామని చెబుతున్నాడు ఆల్‌రౌండర్ జడేజా.
Grip, turn, hitting top of off! \|/ 👌
Ravindra Jadeja with a lovely delivery to dismiss Aiden Markram 🙌
Updates ▶️ https://t.co/Hu11cnrocG#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imjadeja pic.twitter.com/fQSWqWPZUP
— BCCI (@BCCI) November 25, 2025
‘సిరీస్ నాలుగో రోజు మేము బౌలింగ్ చేస్తున్నప్పుడు బంతి కొద్దిగా టర్న్ అయింది. కానీ.. దక్షిణాఫ్రికా ఇప్పటికీ పటిష్ట స్థితిలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం లభించడంతో వారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. వికెట్ మరీ ఎక్కువ టర్న్ కావట్లేదు. ఐదో రోజు బంతి బాగా టర్న్ అవుతుందా? బౌన్స్ ఎక్కువ వస్తుందా? అనేది తెలియదు. ప్రస్తుతానికి మేము చివరి రోజు సెషన్ వారీగా దృష్టి పెడుతాం. తొలి సెషన్లో వికెట్ పడకుండా ఆడగలిగితే బౌలర్లు ఒత్తిడికి లోనవుతారు. అప్పుడు మేము మ్యాచ్ డ్రా కోసం ప్రయత్నిస్తాం. రేపు రోజంతా ఆడితే అది మాకు పెద్ద విజయమే’ అని మీడియాకు చెప్పాడు జడ్డూ.
గువాహటి టెస్టులో అద్భుతం జరిగితే తప్ప భారత జట్టు ఓటమి తప్పించుకునేలా లద సమిష్టి వైఫల్యంతో భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకునేలా ఉంది. విజయంపై ఆశలు ఆవిరైన వేళ.. కనీసం డ్రా కూడా అసాధ్యం అనిపిస్తోంది. మన బ్యాటర్లు కుప్పకూలిన చోట.. దక్షిణాఫ్రికా భారీ స్కోర్ చేసి మ్యాచ్‌పై పట్టుబిగించింది. రెండో ఇన్నింగ్స్‌లోనైనా బాధ్యతగా ఆడాల్సిన ఓపెనర్లు 21 పరుగులకే పెవిలియన్ చేరారు. దాంతో.. నాలుగో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 27 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 522 పరుగులు కావాలి. ఎనిమిది వికెట్లు ఉన్నా.. సిరీస్ సమం చేయాలంటే సఫారీ బౌలర్లను కాచుకొని రోజంతా నిలబడడం గగనమే.
The 50-wicket club vs 🇿🇦
With a 4-wicket haul in the second innings, Ravindra Jadeja enters an exclusive list.
[Ravindra Jadeja, India vs South Africa] pic.twitter.com/5hQXm9Qs8E
— 100MB (@100MasterBlastr) November 25, 2025