ICC : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం పురుషుల ‘టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023(Test Team Of The Year)’ను ప్రకటించింది. నిరుడు సుదీర్ఘ ఫార్మాట్లో అత్యుత్తమంగా రాణించిన 11 మందిని ఎంపిక చేసింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC) 2023 ఫైనల్లో ఆడిన భారత్, ఆస్ట్రేలియా జట్ల నుంచి ఏడుగురుని ఐసీసీ సెలెక్ట్ చేసింది.
ప్యాట్ కమిన్స్(Pat Cummins) కెప్టెన్గా ఉన్న ఈ జట్టులో ఆసీస్ నుంచి ఏకంగా ఐదుగురు చోటు దక్కించుకోగా.. టీమిండియా నుంచి ఆల్రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ఎంపికయ్యారు. ఇంగ్లండ్ నుంచి ఇద్దరు, న్యూజిలాండ్, శ్రీలంక జట్టు నుంచి ఒక్కరు టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023లో స్థానం దక్కించుకున్నారు.
The Men’s Test Team of the Year for 2023 consists of a host of classy performers headed by Australia’s courageous skipper 💥
Find out who made the cut 👇https://t.co/rPgPBOYSL9
— ICC (@ICC) January 23, 2024
టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ : ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్.