YS Sharmila | దేనికైనా సిద్ధమే… నేను రెడీ : వైసీపీ ప్రభుత్వానికి వైఎస్ షర్మిల సవాల్
YS Sharmila | ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీకి మరో జాతీయ పార్టీ నుంచి గట్టి సవాలు ఎదురవుతుంది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీకి మరో జాతీయ పార్టీ నుంచి గట్టి సవాలు ఎదురవుతుంది. నిన్న , మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీతో పాటు జనసేన, బీజేపీ, వామపక్షాల నుంచి గట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీకి ఈసారి వైఎస్ షర్మిల(YS Sharmila) రూపంలో ప్రారంభమయ్యాయి. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే ఏపీలో తన అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) కు, వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా విరుచుకు పడుతున్నారు.
వైసీపీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) ఏపీలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ జగన్ అధికారంలో వచ్చిన తరువాతనే జరుగుతున్నాయని కావాలంటే అభివృద్ధి చూపిస్తానని షర్మిలకు సవాలు విసిరారు. ముఖ్యమంత్రి జగన్‌ను షర్మిల ఏకవచనంతో మాట్లాడడం కరెక్టు కాదని అన్నారు. దీనికి షర్మిల స్పందిస్తూ ‘చేసిన అభివృద్ధి చూపించండి.
తేదీ, సమయం మీరు చెప్పండి. లేదా నేను చెబుతానని ప్రస్తుతం షర్మిల శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తూ సవాల్ విసిరారు. దేనికైనా తాను సిద్ధమేనని అన్నారు. అభివృద్ధి పరిశీలనకు మేధావులను కూడా పిలుద్దామని సూచించారు. మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ ? మీరు చెప్పిన రాజధాని ఎక్కడ? అంటూ ప్రశ్నించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

