Heart Stroke | క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుకు గురైన జవాన్
Heart Stroke | క్రికెట్ ఆడుతుండగా ఓ సైనికుడు గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గర్హ్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
Heart Stroke | భోపాల్ : క్రికెట్ ఆడుతుండగా ఓ సైనికుడు గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గర్హ్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. తికమ్‌గర్హ్ జిల్లాలోని మర్గువా గ్రామానికి చెందిన వినోద్ బన్‌స్కర్(35) ఇండియన్ ఆర్మీలో జవాన్‌గా పని చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం బిరాయు గ్రామంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు వినోద్. అక్కడ క్రికెట్ ఆడుతుండగా ఛాతీలో నొప్పిగా ఉందని చెబుతూ కుప్పకూలిపోయాడు.
అప్రమత్తమైన వినోద్ అన్న జగదీశ్ బన్‌స్కర్.. హుటాహుటిన తికమ్‌గర్హ్ జిల్లా ఆస్పత్రికి తరలించాడు. గుండెపోటుకు గురైన వినోద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో వినోద్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
లాన్స్ నాయక్ వినోద్ ఉత్తరప్రదేశ్‌లోని షాహారన్‌పూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఫిబ్రవరి మొదటి వారంలో వినోద్ విధులకు హాజరు కావాల్సి ఉందని జగదీశ్ తెలిపాడు. మా కళ్లెదుటే తమ్ముడు ప్రాణాలు కోల్పోవడం బాధాకరంగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నాడు జగదీశ్.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

