SRH vs KKR : పదిహేడో సీజన్ క్వాలిఫయర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత మిచెల్ స్టార్క్(3/34) హడెలెత్తించగా.. ఆ తర్వాత బ్యాటర్లు బౌండరీలతో హోరెత్తించారు. వెంకటేశ్ అయ్యర్(51 నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(58 నాటౌట్)లు ధనాధన్ ఆడడారు. దాంతో, కోల్‌కతా13.4 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. దాంతో, అన్ని విభాగాల్లోతేలిపోయిన కమిన్స్ సేన ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్ 2లో ఆడేందుకు ఎదురుచూడనుంది.
పదిహేడో సీజన్లో టేబుల్ టాపర్‌గా నిలిచిన కోల్‌కతా తమ ఆటకు తిరుగులేదని నిరూపించింది. అహ్మదాబాద్ స్టేడియంలో బౌలర్ల జోరుకు, బ్యాటర్ల విధ్వంసం తోడవ్వడంతో హైదరాబాద్‌పై అలవోకగా గెలుపొందింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 160 పరుగుల ఛేదనలో ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్(23), సునీల్ నరైన్(21) అటాకింగ్ గేమ్‌తో శుభారంభమిచ్చారు. లక్ష్యాన్ని కరిగిస్తున్న ఈ జోడీని నటరాజన్ విడదీయడంతో, 44 పరుగుల వద్ద కోల్‌కతా తొలి వికెట్ పడింది.
He got the FIYER! 🔥pic.twitter.com/LNeGXtkH66
— KolkataKnightRiders (@KKRiders) May 21, 2024
ఆది నుంచి తడబడుతున్న నరైన్(21ను కమిన్స్ వెనక్కి పంపినా.. అప్పటికే వెంకటేశ్ అయ్యర్(51 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో చేయాల్సిన నష్టమంతా చేశాడు. సిక్సర్లతో విరుచుకుపడిన వెంకటేశ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(58 నాటౌట్)తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. నితీశ్ రెడ్డి వేసిన 13వ ఓవర్ ఆఖరి బంతికి సిక్సర్ బాది అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత తన వంతు అన్నట్టు ట్రావిస్ హెడ్ బైలింగ్‌లో శ్రేయస్ వరుసగా సిక్స్, ఫోర్, సిక్స్, సిక్స్ బాదాడు. దాంతో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.
అహ్మదాబాద్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) కెప్టెన్ కమిన్స్ బ్యాటింగ్ తీసుకోవడంతో పరుగుల వరద ఖాయమనుకున్నారంతా. కానీ, తొలి ఓవర్లోనే ఊహించని షాక్. గత మ్యాచ్‌లో కోల్‌కతాపై డకౌట్ అయిన ట్రావిస్ హెడ్(0)ను స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(3/22) మరోసారి సున్నాకే బౌల్డ్ చేశాడు. ఆ కాసేపటికే అభిషేక్ శర్మ(3) సైతం ఔటయ్యాడు. అంతే 13 పరుగులకే రెండు వికెట్లు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి(55) అద్భుతంగా పోరాడాడు.

ఒక ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయిన అతడు హెన్రిచ్ క్లాసెన్(32అండగా 50 ప్లస్ భాగస్వామ్యం నెలకొల్పాడు. వీళ్లిద్దరూ ధాటిగా ఆడడంతో హైదరాబాద్ స్కోర్ 170 దాటుతుందనిపిచింది. కానీ, చక్రవర్తి ఈ జోడీని విడదీసి కోల్‌కతాను పోటీలోకి తెచ్చాడు. చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్(30), అబ్దుల్ సమద్(16)ల మెరపులతో హైదరాబాద్ పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది. కోల్‌కతాకు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
🥁 We have our first FINALIST of the season 🥳
𝗞𝗼𝗹𝗸𝗮𝘁𝗮 𝗞𝗻𝗶𝗴𝗵𝘁 𝗥𝗶𝗱𝗲𝗿𝘀 💜 are one step closer to the ultimate dream 🏆
Scorecard ▶️ https://t.co/U9jiBAlyXF#TATAIPL | #KKRvSRH | #Qualifier1 | #TheFinalCall pic.twitter.com/JlnllppWJU
— IndianPremierLeague (@IPL) May 21, 2024