Shreyas Iyer : ఐపీఎల్లో తన మార్క్ కెప్టెన్సీతో రాణిస్తున్న శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) టీ20ల్లో, టెస్టుల్లో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. అక్టోబర్ నుంచి సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌తో అతడు జట్టులోకి వస్తాడని అభిమానులు ఆశించారు. కానీ, అనూహ్యంగా అయ్యర్ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తనకు కొంచెం బ్రేక్ కావాలని బీసీసీఐ(BCCI)కి లేఖ రాశాడు.
ఆస్ట్రేలియా ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌ల కోసం భారత ఏ జట్టుకు అయ్యర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడి నేతృత్వంలో బరిలోకి దిగిన టీమిండియా మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. రెండో మ్యాచ్‌లో ఆసీస్‌ను కంగారెత్తించాలనుకున్న భారత జట్టుకు అయ్యర్ షాకిచ్చాడు. తనకు కొన్ని రోజులు టెస్టు క్రికెట్ నుంచి విశ్రాంతి కావాలని బీసీసీఐకి లేఖ రాశాడు. అతడి అభ్యర్థనకు బోర్డు ఆమోదం తెలిపింది. దాంతో.. వైస్ కెప్టెన్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) జట్టును నడిపిస్తున్నాడు. అయితే.. ఫిట్నెస్ సమస్యలతోనే అయ్యర్ బ్రేక్ తీసుకోవాలని భావించినట్టు సమాచారం.
End of Shreyas Iyer in Tests? 🤔
🗣 @bhogleharsha & @RohanGava9, on Cricbuzz Live 🎙 #India #TestCricket pic.twitter.com/KQd3hekUlK
— Cricbuzz (@cricbuzz) September 24, 2025
ఈమధ్యే ముగిసిన దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్‌కు ఆడిన అయ్యర్ అసౌకర్యంగా కనిపించాడు. ఆపై ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టుతో మ్యాచ్‌లోనూ అతడు పెద్దగా రాణించలేదు. మ్యాచ్ అనంతరం ఫిజియోతో మాట్లాడిన అతడు ఫిట్నెస్ మెరుగుపరచుకుకొని మళ్లీ టెస్టులు ఆడాలని నిర్ణయించుకున్నాడు. ‘అయ్యర్ బ్రేక్ కావాలని మాత్రమే అడిగాడు. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన తర్వాత అతడు సుదీర్ఘ ఫార్మాట్లో అడుగుపెడుతాడు. అప్పుడు అయ్యర్ టెక్నికల్‌గానూ మరింత బలంగా ఉంటాడు’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఫిట్‌గా లేని అయ్యర్ త్వరలో ప్రారంభం కానున్న విండీస్ సిరీస్‌తో పాటు రంజీ ట్రోఫీకి దూరం కానున్నాడు. ఇప్పటివరకూ ఈ సొగసరి బ్యాటర్ 14 టెస్టులు, ముంబై తరఫున 70 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.
Shreyas Iyer who owned world’s current greatest pacer Bumrah in do or die game has no place in Indian team but Gill who can’t score even against oman and pacer is in the team.
Like and repost this tweet if you want Shreyas Iyer to be the next captain.pic.twitter.com/NiJTqYqRuK
— 𝑨𝒏𝒖𝒓𝒂𝒏 🚩 (@AnuranDey_96) September 22, 2025
రెండేళ్ల క్రితం వెన్ను గాయం నుంచి కోలుకుని వన్డే జట్టులోకి వచ్చిన అయ్యర్.. వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో చెలరేగి ఆడాడు. దాంతో.. నాలుగో స్థానంలో అతడికి ఢోకా లేదని అనుకున్నారంతా. కానీ, ఫామ్‌లో ఉన్నప్పటికీ జట్టు కూర్పు దృష్ట్యా అతడికి ఆసియా కప్ (Asia Cup 2025) స్క్వాడ్‌లో చోటు దక్కలేదు. దాంతో.. సెలెక్టర్లపై తీవ్రంగా విమర్శలు రావడంతో అయ్యర్‌కు భారత ‘ఏ’ జట్టు కెప్టెన్సీ అప్పగించారు. స్వదేశంలో ఆస్ట్రేలియా ఏ జట్టును ఈ సొగసరి ప్లేయర్ తనదైన వ్యూహాలతో మట్టికరిపిస్తాడని అందరూ ఊహించారు. కానీ, సీన్ రివర్సైంది.