హైదరాబాద్, ఆట ప్రతినిధి: గువాహటి(అస్సాం) వేదికగా జరిగిన ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్ టోర్నీలో రాష్ర్టానికి చెందిన బాసిరెడ్డి రిశితారెడ్డి విజేతగా నిలిచింది. శనివారం జరిగిన బాలికల జే60 విభాగం సింగిల్స్ ఫైనల్లో రిశిత 7-5, 6-4తో ప్రియాంక రానా(అమెరికా)పై అద్భుత విజ యం సాధించింది. ఆది నుంచే తనదైన ఆధిపత్యం ప్రదర్శించిన రిశిత వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించింది. టోర్నీ మొత్తం ఈ యువ టెన్నిస్ ప్లేయర్ కనీసం ఒక్క సెట్ కూడా ఓడిపోకపోవడం విశేషం. ఐటీఎఫ్ జూనియర్ కేటగిరీలో ప్రస్తు తం రిశిత 252 వ ర్యాంక్‌లో కొనసాగుతున్నది.