INDvsAUS Final: కోహ్లీ వికెట్ తీయగానే లక్ష గొంతులు మూగవోయాయి.. దానికి మించిన ఆనందమే లేదుః కమిన్స్
INDvsAUS Final: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్ తీసినప్పుడు లక్ష మంది భారత అభిమానులు మూగవోయాయని ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ అన్నాడు.
INDvsAUS Final: కొద్దిరోజుల క్రితమే అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆసీస్ మధ్య ముగిసిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్ తీసినప్పుడు లక్ష మంది భారత అభిమానులు మూగవోయాయని, ఆ క్షణాన్ని తాను జీవితకాలం గుర్తుంచుకుంటానని ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ అన్నాడు. ప్రపంచ కప్ గెలిచిన ఆసీస్ సారథి సిడ్నీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆ నిశ్శబ్దాన్ని తాను ఆస్వాదించానని కమిన్స్ తెలిపాడు.
కమిన్స్ మాట్లాడుతూ.. ”కోహ్లీ వికెట్ పడగానే మేమంతా ఒక్క చోట చేరాం. అప్పుడు స్మిత్ వచ్చి బాయ్స్.. ఒకసారి స్డేడియంలో ఉన్న క్రౌడ్ నిశ్వబ్దాన్ని వినండి అని చెప్పాడు. మేం కూడా అందరం కామ్గా ఆ నిశ్వబ్దాన్ని విన్నాం. నాకైతే అది ఒక లక్ష మంది కూర్చున్న లైబ్రరీలా అనిపించింది. ఆ క్షణాలను నేను నా జీవితకాలం గుర్తుంచుకుంటాను“ అని చెప్పాడు.
Pat Cummins said, “after Virat Kohli’s wicket, we’re in the huddle and Steven Smith said ‘boys, listen to the crowd’. We just took a moment of pause, it was as quiet as a library. 1,00,000 Indians were there yet so quiet. I’ll savour that moment for a long time”. (SMH). pic.twitter.com/HaDoaT9oqV
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 27, 2023
ఇక వన్డే ప్రపంచకప్ను గెలవడం చాలా ప్రత్యేకమని, ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలను సొంతం చేసుకున్నవారని కమిన్స్ అన్నాడు. ఒక ట్రోఫీని అందుకోవడం గొప్ప విషయమైతే.. తమ జట్టు ఫార్మాట్లలోనూ ట్రోఫీలను నెగ్గామంటే అది తమ ఆటగాళ్ల నిబద్దతకు తోడు కోచింగ్ స్టాఫ్ వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చాడు. 11 మందితో ఇది సాధ్యమయ్యేది కాదని, తమ జట్టులో 25 మంది మెరుగైన ఆటగాళ్లు కావాలని, అలాంటి బెంచ్ తమకు ఉంది కావునే అన్ని ఫార్మాట్లలో విజయాలు సాధించగలుగుతున్నామని కమిన్స్ తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

