పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు ఇజ్రాయెల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇటీవలే హైదరాబాద్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన తర్వాత రిజ్వాన్ ఈ విజయాన్ని గాజాలోని ప్రజలకు అంకితమిచ్చాడు. కాగా భారత్ – పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్‌లో మ్యాచ్ ముగిశాక ఇజ్రాయెల్.. రిజ్వాన్‌తో పాటు పాకిస్తాన్‌కూ కౌంటర్ ఇచ్చింది.
వివరాల్లొకెళ్తే.. హైదరాబాద్ వేదికగా ఈనెల 10న లంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు లంకేయులు నిర్దేశించిన 345 పరుగుల లక్ష్యాన్ని మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది. మ్యాచ్‌లో రిజ్వాన్.. 131 పరుగులు చేశాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత రిజ్వాన్ ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందిస్తూ.. ‘ఈ విజయం గాజాలోని మా అక్కాచెల్లెళ్లకు, అన్నాతమ్ముళ్లకు అంకితం. గెలిచినందుకు సంతోషంగా ఉంది. పాకిస్తాన్ టీమ్‌తో పాటు ప్రత్యేకించి అబ్దుల్లా షఫీక్, హసన్ అలీలు మా విజయంలో కీలక పాత్ర పోషించారు’ అని ట్వీట్ చేశాడు.
కాగా భారత్ –పాక్ మ్యాచ్ ముగిశాక ఇజ్రాయెల్ స్పందిస్తూ.. ‘మా భారతీయ మిత్రులు ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలుపుతుండటం మమ్మల్ని ఎంతగానో కదిలించింది. భారత్ – పాకిస్తాన్ మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. తద్వారా పాకిస్తాన్‌కు తమ విజయాన్ని హమాస్ ఉగ్రవాదులకు ఆపాదించడానికి అవకాశం లేకుండా పోయింది..’అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
This was for our brothers and sisters in Gaza. 🤲🏼
Happy to contribute in the win. Credits to the whole team and especially Abdullah Shafique and Hassan Ali for making it easier.
Extremely grateful to the people of Hyderabad for the amazing hospitality and support throughout.
— Muhammad Rizwan (@iMRizwanPak) October 11, 2023
We were really moved by Indian friends showing their solidarity with Israel 🇮🇱
We are happy that India🇮🇳emerged victorious in the #INDvsPAK match at #CWC23 and that Pakistan was unable to attribute its victory to the terrorists of #Hamas. https://t.co/tvgYATe0Af
— Israel ישראל 🇮🇱 (@Israel) October 15, 2023
ఇదిలాఉండగా భారత్ – పాక్ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో రిజ్వాన్ బ్యాటింగ్ చేస్తుండగా నమాజ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అతడు ఔట్ అయి పెవిలియన్‌కు వెళ్తుండగా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్.. ‘జై శ్రీరాం’ అని నినదించారు.