సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తప్పుకోవడంతో.. అతడి స్థానంలో తెలుగు ఆటగాడు కోన శ్రీకర్ భరత్‌కు అవకాశం దక్కింది. వ్యక్తిగత కారణాలతో ఇషాన్ ఈ సిరీస్‌కు దూరం కావడంతో.. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత-‘ఏ’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న భరత్‌ను ఎంపిక చేశారు. ‘ఇషాన్ ఈ సిరీస్ నుంచి మినహాయింపు కోరాడు. దీంతో సీనియర్ సెలెక్షన్ కమిటీ భరత్‌ను జట్టులో చేర్చింది’ అని ఆదివారం బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సిరీస్ నుంచి టెస్టుల్లోనూ కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించనుండటంతో.. భరత్‌కు తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే.