చెన్నై : ఈస్ట్ జోన్ బ్యాటర్ , కెప్టెన్ ఇషాన్ కిషన్(Ishan Kishan) చరిత్ర సృష్టించాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో డబుల్ సెంచరీ సాధించిన అయిదో బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. సౌత్ జోన్‌తో చెన్నైలో జరుగుతున్న మ్యాచ్‌లో.. ఇవాళ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేశాడు. 250 రన్స్ చేసి అతను రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. బలహీనంగా ఉన్న సౌత్ జోన్ బౌలింగ్ బృందాన్ని ఆటపట్టించాడు ఇషాన్. బౌండరీలతో హోరెత్తించాడు. అతని ఇన్నింగ్స్‌లో 27 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. ఇషాన్ కిషన్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇదే మొదటి డబుల్ సెంచరీ కావడం కూడా విశేషం. డబుల్ సెంచరీతో ఇషాన ఎలైట్ లిస్టులో చేరాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్లలో రమన్ లాంబా, అన్షుమన్ గైక్వాడ్, చతేశ్వర్ పూజారా, యశ్వంత్ జైస్వాల్ ఉన్నారు. 1987-88 సీజన్లో వెస్ట్ జోన్‌పై రమన్ లాంబా 320 స్కోర్ చేశాడు. 1987-88లో నార్త్ జోన్‌పై 216 స్కోరు చేశాడు గైక్వాగ్. ఇక 2016-17లో చతేశ్వర్ పూజారా 256 చేశాడు. జైస్వాల్ 2022-23లో సౌత్ జోన్‌పై 209 రన్స్ చేశాడు.
Ishan Kishan brings up his 2️⃣0️⃣0️⃣ in style 💯💯 🙌
What a magnificent knock from the East Zone captain so far 👏👏
Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/2NaE6qG4VK
— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026