కైరో: ప్రతిష్ఠాత్మక ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత యువ షూటర్ ఇషాసింగ్ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే రెండు పతకాలు ఖాతాలో వేసుకున్న ఇషా తాజాగా మరో స్వర్ణాన్ని ముద్దాడింది. మంగళవారం జరిగిన 25మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల జూనియర్ టీమ్ఈవెంట్లో ఇషా సత్తాచాటింది. చైనాతో జరిగిన పసిడి పతక పోరులో భారత త్రయం ఇషాసింగ్, శిఖా నార్వల్, వర్షా సింగ్ 16-6 తేడాతో చైనా జట్టుపై అద్భుత విజయం సాధించింది. అర్హత రౌండ్ నుంచే తమదైన దూకుడు ప్రదర్శించిన భారత షూటర్లు 576 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు.