టోక్యో: ఒలింపిక్స్‌లో ఇండియాకు మెడల్‌పై ఆశలు రేపుతున్న వాళ్లలో రెజ్లర్ వినేష్ పోగాట్ కూడా ఒకరు. పోగాట్ 53 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్లో పాల్గొంటోంది. ఆమె తొలి మ్యాచ్ ఆగస్ట్ 5న జరగనుంది. గత రియో ఒలింపిక్స్ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఆమె మోకాలికి తీవ్ర గాయం కావడంతో స్ట్రెచర్‌పై తీసుకెళ్లాల్సి వచ్చింది. దీంతో ఈసారి తమకు ప్రత్యేకంగా ఓ ఫిజియో థెరపిస్ట్ కావాలని ఆమె డిమాండ్ చేసింది. ఇదే విషయాన్ని ఓ పత్రిక రాయగా.. దానిని ట్వీట్ చేస్తూ ఫిజియోథెరపిస్ట్‌ను అడగడం కూడా తప్పేనా అని వినేష్ కామెంట్ చేసింది.
ఒలింపిక్స్‌లో నలుగురు మహిళా రెజ్లర్లు ఉన్నారు. అందరికీ కలిపి ఒక ఫిజియో థెరపిస్ట్‌ను అడిగాము. అది కూడా నేరమేనా? ఒక అథ్లెట్‌కు ఒకరికి మించి కోచ్‌లు/సిబ్బంది ఉన్న సందర్భాలు లేవా అని ఆమె ప్రశ్నించింది. అయినా తాము చివరి నిమిషంలో అడగలేదని, చాలా రోజుల కిందే ఫిజియో కావాలని అడిగినట్లు ఆమె చెప్పింది. ఈ ఏడాది ఏషియన్ చాంపియన్‌షిప్స్ సహా ఆడిన అన్ని మ్యాచ్‌లలోనే వినేష్ పోగాట్ గెలిచింది. టాప్ ఫామ్‌లో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది.
Is it a crime to ask for one Physiotherapist for four women wrestlers when there are instances of one athlete having multiple coaches/ Staff? Where is the balance?We have asked for a Physio long back and not at the last moment as reported.@IOA_Official @PMOIndia @ianuragthakur pic.twitter.com/bwbOQfFglo
— Vinesh Phogat (@Phogat_Vinesh) July 22, 2021