T20 World Cup 2026 : భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడబోమని పంతం పట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB)కు బిగ్ షాక్ తగిలింది. శ్రీలంకలో ఆడేందుకు వీలు కల్పించేలా.. గ్రూప్ స్వాపింగ్ చేయాలని ఐసీసీ(ICC)ని కోరిన బంగ్లా బోర్డుకు నిరాశే మిగిలింది. ఐర్లాండ్ స్థానంలో తమను గ్రూప్ బీలోకి మార్చాలని అభ్యర్థించిన బంగ్లాదేశ్ ఆశలపై క్రికెట్ ఐర్లాండ్(Cricket Ireland) నీళ్లు చల్లింది. ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రూప్ మారబోమని, శ్రీలంకలోనే తాము ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడుతామని ఆదివారం ఐర్లాండ్ స్పష్టం చేసింది.
పొట్టి ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లపై అనిశ్చితికి తెరపడం లేదు. ఐసీసీ సభ్యులు ఢాకా వెళ్లి.. ఆ బోర్డు సభ్యులతో చర్చలు జరిపినా వారు తమ నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు. ‘గ్రూప్ స్వాపింగ్ చేయండి.. ఐర్లాండ్‌ను గ్రూప్ సీలో.. మమ్మల్ని గ్రూప్ బీలోకి మారిస్తే మా జట్టు శ్రీలంకలో ఆడుతుంది’ అని బంగ్లా బోర్డు ఐసీసీకి విన్నవించుకుంది.
Amid reports that the Bangladesh Cricket Board (#BCB) proposed a group swap with Ireland for the T20 World Cup 2026, Cricket Ireland has confirmed that the International Cricket Council (#ICC) will not move Ireland’s matches out of Sri Lanka.
Read more here:… pic.twitter.com/bQS9JFRrFB
— The Daily Star (@dailystarnews) January 18, 2026
తమ సమస్యను పరిష్కరించుకునేందుకు ఐర్లాండ్‌ను గ్రూప్ మార్చాలని కోరడంపై ఆ దేశ క్రికెట్ బోర్డు భగ్గుమంది. ‘పొట్టి ప్రపంచకప్ షెడ్యూల్‌పై మాకు స్పష్టమైన హామీ లభించింది. అందుకని ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మేము వరల్డ్‌కప్ మ్యాచ్‌లు శ్రీలంకలోనే ఆడుతాం’ అని క్రికెట్ ఐర్లాండ్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది. దాంతో.. బంగ్లాదేశ్ బోర్డు తదుపరి ఏం నిర్ణయం తీసుకోనుంది? షెడ్యూల్‌కు కట్టుబడి కోల్‌కతా, ముంబైలోనే లీగ్ మ్యాచ్‌లు ఆడుతుందా? అనేది అందరిలోఆసక్తి రేపుతోంది.