IPL Retention : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ రిటెన్షన్‌కు ఒక్కరోజే ఉంది. శనివారం మధ్యాహ్నం 3 గంటల్లోపు అన్ని ఫ్రాంచైజీలు తాము వదులుకుంటున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే అన్ని జట్ల యజమానులు దాదాపుగా లిస్ట్‌ను సిద్ధం చేశారు. ఊహించినట్టుగానే పేలవ ప్రదర్శన చేసిన పలువురు స్టార్ ఆటగాళ్లపై వేటు పడే అవకాశముంది. ఇంకేముంది కొందరిలో రి’టెన్షన్’ మొదలైంది. క్రిక్‌బజ్ రాబట్టిన సమాచారం ప్రకారం వీరిలో మ్యాక్స్‌వెల్(Maxwell), వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer), రవి బిష్ణో్య్, పేసర్ ఆకాశ్ దీప్‌లు ఉండడం ఖాయమని తెలుస్తోంది. మెగా వేలంలో కోట్లు కొల్లగొట్టిన మరికొందరు కూడా వీళ్లతో పాటు వేలంలోకి రాబోతున్నారు.
టీ20 ఫార్మాట్‌ను కొత్తపుంతలు తొక్కించిన ఐపీఎల్.. వందలాది క్రికెటర్లను కోటీశ్వరులను చేసింది. అనుభవమే ఆస్తిగా సీనియర్లను, దమ్మున్న కుర్రాళ్లను, మ్యాచ్ విన్నర్లను భారీ ధర పలికేలా చేసింది. ఆట అదిరితే అందలం.. లేదంటే పాతాళం అన్న సూత్రాన్ని పాటించే ఫ్రాంచైజీలు.. ఈసారి అదే పనిలో ఉన్నాయి. పద్దెనిమిదో సీజన్లో చెత్తగా ఆడిన వాళ్లను.. వికెట్లు తీయలేని వాళ్లకు షాక్‌లు ఇచ్చేందుకు పది జట్లు సిద్ధమయ్యాయి. వీరిలో మొదటి పేరు వెంకటేశ్ అయ్యర్. ఈ లెఫ్ట్ హ్యాండర్‌ను రూ.23.75 కోట్లకు అట్టిపెట్టుకున్న కోల్‌కతా తీవ్రంగా భంగపడింది.
🚨 Cricbuzz Exclusive
Venkatesh Iyer is likely to be released by KKR
There remains a possibility that the franchise may attempt to buy him back
He was bought for INR 23.75 crore in the previous auction#IPLAuction #IPL2026 pic.twitter.com/Oz9t2RBWEC
— Cricbuzz (@cricbuzz) November 14, 2025
విధ్వంసక ఆటకు కేరాఫ్ అయిన అయ్యర్ 11 మ్యాచుల్లో 142 పరుగులతో ఉసూరుమనిపించాడు. అలానే ఓపెనర్ క్వింటన్ డికాక్ (రూ.3.6కోట్లు) పేసర్ అన్రిచ్ నోర్జి(రూ.6.5కోట్లు)లను కూడా వదిలేయనుంది కోల్‌కతా. అయితే.. కెప్టెన్ అజింక్యా రహానే(రూ.1.5కోట్లు)ను అట్టిపెట్టుకోనుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కూడా రిటెన్షన్‌పై గట్టిగానే కసరత్తు చేస్తోంది. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klassen)ను రూ.23 కోట్లకు రీటైన్ చేసుకోనుంది ఆరెంజ్ ఆర్మీ. కానీ, ఎవరిపై వేటు పడనుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే పేసర్ షమీని లక్నో సూపర్ జెయింట్స్(LSG)కు ఇచ్చేసేందుకు అంగీకరించింది హైదరాబాద్. పద్దెనిమిదో సీజన్లో 6 వికెట్లకే పరిమితమైన షమీని రూ.10 కోట్లకు లక్నో కొనడంపై చర్చలు జరుగుతున్నాయి.
🚨 GLENN MAXWELL IS NOT GOING TO CSK ❌ [Espn Cricinfo] pic.twitter.com/QvVhgQom2Z
— Johns. (@CricCrazyJohns) November 14, 2025
ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వేలానికి ముందే ఇద్దరు స్టార్లను పట్టేసింది. ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ (Shardul Thakur)ను లక్నో సుంచి రూ.2 కోట్లకు కొన్న ముంబై.. గుజరాత్ నుంచి రూ.2.6కోట్లకు షెర్ఫానే రూథర్ఫోర్డును దక్కించుకుంది. ముంబై రిటెన్షన్ ఆటగాళ్ల లిస్ట్ అయితే తెలియడం లేదు. కానీ, విల్ జాక్స్‌ను రిలీజ్ చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అత్యధికంగా ఆరుగురిని వేలానికి పంపించనుంది. వీరిలో.. న్యూజిలాండ్ ద్వయం రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వేలతో పాటు విజయ్ శంకర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠిలు ఉండడం ఖాయమనిపిస్తోంది. ఇంతకూ పది ఫ్రాంచైజీలు వదిలేసేందుకు రెఢీ అయిన ఆటగాళ్లు ఎవరంటే..?
కోల్‌కతా నైట్ రైడర్స్ – వెంకటేశ్ అయ్యర్, క్వింటన్ డికాక్, అన్రిజ్ నోర్జే.
లక్నో సూపర్ జెయింట్స్ – రవి బిష్ణోయ్, డేవిడ్ మిల్లర్, ఆకాశ్ దీప్, షమర్ జోసెఫ్.
ఢిల్లీ క్యాపిటల్స్ – నటరాజన్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – మయాంక్ అగర్వాల్, లివింగ్‌స్టోన్, బ్లెస్సింగ్ ముజరబని, రసిక్ దార్.
పంజాబ్ కింగ్స్ – గ్లెన్ మ్యాక్స్‌వెల్, అరోన్ హర్డీ.
ముంబై ఇండియన్స్ – విల్ జాక్స్.
రాజస్థాన్ రాయల్స్ – లానే డ్రి ప్రిటోరియస్, థీక్షణ, ఫజల్హక్ ఫారూఖీ, క్వెనా మఫాకా.
చెన్నై సూపర్ కింగ్స్ – డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, విజయ్ శంకర్, జేమీ ఓవర్టన్,