IPL 2026 Auction : ఐపీఎల్ మినీ వేలంలో యువక్రికెటర్లు కోట్లు కొల్లగొడుతుంటే.. గత సీజన్లలో దంచేసిన ఆటగాళ్లకు మాత్రం చుక్కెదురైంది. కనీస ధరకు కూడా వీళ్లను కొనేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. ఫలితంగా పృథ్వీ షా(Prithvi Shaw), విజయ్ శంకర్, రచిన్ రవీంద్ర (Rachin Ravindra), బెయిర్‌స్టో, రహ్మనుల్లా గుర్బాజ్ వంటి స్టార్లు నిరాశకు లోనయ్యారు. వీరిలో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ప్లేయర్లకు కూడా వేలంలో బిగ్ షాక్ తగిలింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంపై భారీ ఆశలు పెట్టుకున్న క్రికెటర్లకు ఊహించని షాకిచ్చాయి ఫ్రాంచైజీలు. గతంలో మ్యాచ్ విజేతలుగా పేరొందిన రచిన్ రవీంద్ర, బెయిర్‌స్టో, డెవాన్ కాన్వే, లివింగ్‌స్టోన్ వంటి హిట్టర్లను కనీస ధరకు కూడా ఎవరూ కొనలేదు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అర్ద శతకాలతో రెచ్చిపోయిన పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్‌లను సైతం ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్(Srikar Bharat)ను సైతం వదిలేశారు.
Here are the unsold players from set 9#SimarjeetSingh #KarnSharma #IPLAuction #IPL2026Auction #TATAIPL #TATAIPLAuction #WicketWatcher pic.twitter.com/wmed5TysvO
— WicketWatcher (@WicketWatcher_) December 16, 2025
ఇక భారత అన్క్యాప్డ్ ప్లేయర్లలో శివం మావి, మహిపాల్ లొమ్రోర్, అన్మోల్ప్రీత్ సింగ్.. తదితరులు వేలంలో అమ్ముడుపోలేదు. అలానే విశ్వవేదికపై చెలరేగిన బౌలర్లు అట్కిన్సన్, మ్యాట్ హెన్రీలను ఎవరూ కొనలేదు. ప్రస్తుతానికి అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా ఇది.
భారత క్రికెటర్లు : విజయ్ శంకర్, రాహుల్ చాహర్, ఆకాశ్ దీప్, పృథ్వీ షా, సిమర్జిత్ సింగ్, రాజ్ లింబానీ, తుషార్ రహేఉజా, రుచిత్ అహిర్, సన్వీర్ సింగ్, కమలేష్ నగర్కొటి, తనుష్ కొతియాన్, మహిపాల్ లోమ్రోర్, రాజ్వర్ధన్ హంగ్రేకర్, ఈడెన్ టామ్, ఆర్య దేశాయ్, యశ్ ధుల్, అభినవ్ మనోహర్, అన్మోల్ప్రీత్ సింగ్, అభినవ్ తెజ్రన, అథైర్వ తైడే, శివం మావి, కేఎస్ భరత్, దీపక్ హుడా, సర్ఫరాజ్ ఖాన్, కుమార్ కార్తికేయ సింగ్, విఘ్నేష్ పుతూర్, ప్రశాంత్ సోలంకి, కరన్ శర్మ.
Here are the Unsold players from set 7 and 8#VijayShankar #KamleshNaharkoti #VanshBedi #MahipalLomror #IPLAuction #IPL2026Auction #TATAIPL #TATAIPLAuction #cricket #WicketWatcher pic.twitter.com/kctKz1xdIZ
— WicketWatcher (@WicketWatcher_) December 16, 2025
ఆస్ట్రేలియా క్రికెటర్లు : ఫ్రేజర్ మెక్‌గుర్క్, స్పెన్సర్ జాన్సన్.
న్యూజిలాండ్ క్రికెటర్లు : రచిన్ రవీంద్ర, మ్యాట్ హెన్రీ, డెవాన్ కాన్వే.
ఇంగ్లండ్ క్రికెటర్లు : జానీ బెయిర్‌స్టో, లియాం లివింగ్‌స్టోన్, జేమీ స్మిత్, గస్ అట్కిన్సన్.
అఫ్గనిస్థాన్ క్రికెటర్లు : ముజీబ్ రెహ్మాన్, ఫజల్హక్ ఫారూకీ, రహ్మనుల్లా గుర్బా్జ్.
దక్షిణాఫ్రికా క్రికెటర్లు : గెరాల్డ్ కొయెట్జీ, వియాన్ మల్డర్.