క్రికెట్ పండగ ఐపీఎల్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఈ నెల 26న ఈ వేడుక ప్రారంభం అవుతుందని ఐపీఎల్ నిర్వాహకులు అంతకుముందే ప్రకటించారు. ఈసారి మొత్తం పది జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. దీంతో మ్యాచులు నిర్వహించే విధానంలో బీసీసీఐ కొన్ని మార్పులు చేసింది. ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన సంఖ్యను బట్టి జట్లను రెండు గ్రూపులుగా విడగొట్టింది.
అయితే 26వ తేదీ నుంచి ఎవరెవరి మధ్య ఎప్పుడెప్పుడు మ్యాచులు జరుగుతాయనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా బీసీసీఐ ఈ విషయాన్ని కూడా ప్రకటించింది. మార్చి 26 సాయంత్రం 7.30 నిమిషాలకు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడపోతున్నాయని బీసీసీఐ ప్రకటించింది.
అంతేకాదు, ఆ తర్వాత కూడా ఏ రోజు ఏ జట్ల మధ్య మ్యాచులు జరుగుతాయనే పూర్తి షెడ్యూల్‌ను వెల్లడించింది. ఈ టోర్నీలో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సారీ ఐపీఎల్‌కు టాటా కంపెనీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
IPL 2022 schedule: pic.twitter.com/MZNLYdN14e
— Johns. (@CricCrazyJohns) March 6, 2022