IPL 2026 : పంతొమ్మిదో సీజన్ మొదలై వారం దాటినా కొందరు ప్రధాన బౌలర్లు మాత్రం ఇంకా భారత్‌కు చేరుకోలేదు. వేలంలో భారీ ధర పలికిన మథీశ పథిరన(Matheesha Pathirana), మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga)ల ఆగమనంపై కూడా స్పష్టత లేదు. శ్రీలంక క్రికెట్ కొత్త నిబంధనల ప్రకారం వీరిద్దరూ ఫిట్నెస్ టెస్టు పాసైతేనే ఐపీఎల్ ఆడే అవకాశముంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు ఎప్పుడు ఫిట్నెస్ టెస్టుకు హాజరవుతారు? తమ ఫ్రాంచైజీతో ఎప్పుడు కలుస్తారు? అనేది అభిమానుల్లో ఆందోళనకు కారణమవుతోంది.
ప్రధాన పేసర్ల కొరతతో అల్లాడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ పథిరన రాక కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ సైతం మ్యాచ్ విన్నరైన హసరంగ ఎప్పుడొస్తాడా? అని ఆశగా ఉంది. అయితే.. ఈ మధ్యే ముగిసిన పొట్టి ప్రపంచకప్‌లో గాయపడిన యార్కర్ కింగ్ మథీశ పథిరన, వనిందు హసరంగ కోలుకుంటున్నారు. వీరు ఇంకా ఫిట్నెస్ పరీక్షకు హాజరవ్వాల్సి ఉంది.
Matheesha Pathirana and Wanindu Hasaranga are among 15 Sri Lankan players under central contracts yet to partake in mandatory fitness tests, SLC has confirmed, while six others are understood to have failed at least one attempt
Details: https://t.co/VYQ9M6QhmH pic.twitter.com/BedQM6Dfv3
— ESPNcricinfo (@ESPNcricinfo) April 6, 2026
అయితే.. ఐపీఎల్ ఆడేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం హసరంగ ఇంకా లంక బోర్డుకు దరఖాస్తు చేసుకోలేదు. పథిరన మాత్రం నెట్స్‌లో బౌలింగ్ సాధన చేస్తున్నాడు. అతడు ఫిట్నెస్ టెస్టు పాసై.. ఏప్రిల్ మూడో వారంలో ఐపీఎల్ కోసం భారత్‌కు వచ్చే అవకాశాలున్నాయి. లంక బోర్డు కొత్తగా తీసుకొచ్చిన ఫిట్నెస్ నిబంధనలపై క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్లో ఆడేందుకు అనుమతివ్వాలని ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నువాన్ తుషార ఏకంగా కోర్టునే ఆశ్రయించిన విషయం తెలిసిందే.