IPL Auction 2024: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మినీ వేలంలో యువ ఆటగాళ్లు సమీర్ రిజ్వి, శుభమ్ దూబేలు జాక్‌పాట్ కొట్టారు. జాతీయ జట్టుకు ఇంతవరకూ ఆడని ఈ అన్క్యాప్డ్ ప్లేయర్స్.. వేలంలో ఎవరూ ఊహించని ధర దక్కించుకున్నారు. ఫినిషర్ అయిన శుభమ్ దూబేను రాజస్తాన్ రాయల్స్ రూ. 5.8 కోట్లతో దక్కించుకోగా సమీర్ రిజ్విని చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ. 8.4 కోట్లతో సొంతం చేసుకుంది.
దూబే ధూం ధాం..
దేశవాళీలో విదర్భకు ఆడే శుభమ్ దూబే.. ఎడమ చేతి వాటం బ్యాటర్. ఫినిషర్‌గా గుర్తింపు దక్కించుకున్న దూబేను దక్కించుకోవడానికి రాజస్తాన్ రాయల్స్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌లు పోటీపడ్డా రాయల్స్ అతడిని దక్కించుకుంది. అన్క్యాప్డ్ బ్యాటర్ల జాబితాలో రూ. 20 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన దూబే ఏకంగా రూ. 5.8 కోట్లు దక్కించుకోవడం గమనానర్హం. అతడి కనీస ధరకు ఇది 29 రెట్లు అధికం. మిడిలార్డర్లో మెరుపులు మెరిపించే దూబే.. ఇటీవలే ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో ఏడు ఇన్నింగ్స్‌లలో 221 పరుగులు చేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే దూబే.. ఫినిషర్‌గా గుర్తింపు పొందాడు.
Shubham Dubey in Syed Mushtaq Ali Trophy 2023:
– 7 matches.
– 221 runs.
– 73.66 average.
– 187.28 Strike Rate.He’s sold to Rajasthan Royals at 5.80cr. pic.twitter.com/7dGLmJrd0m
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 19, 2023
సాహో సమీర్..
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన రిజ్వీ కోసం చెన్నై, గుజరాత్లో పోటీపడ్డాయి. అన్క్యాప్డ్ లిస్ట్‌లో ఉన్న రిజ్వీ కూడా రూ. 20 లక్షలతో బరిలోకి దిగి ఏకంగా రూ. 8.4 కోట్ల ధర దక్కించుకున్నాడు. రిజ్వీ కోసం ఢిల్లీ కూడా పోటీలోకి వచ్చినా ఆల్ రౌండర్ కోసం చూస్తున్న సీఎస్కే.. అతడికోసం భారీ ధరకు కూడా వెనుకాడలేదు. ఇటీవలే ముగిసిన యూపీ టీ20 లీగ్‌లో తొమ్మిది ఇన్నింగ్స్‌లలోనే 455 పరుగులు చేశాడు.
The future in CSK.
– Sameer Rizvi will play for CSK. 💪pic.twitter.com/UoFKzcPdZK
— Johns. (@CricCrazyJohns) December 19, 2023