IPL Auction 2024: క్రికెట్ అభిమానులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 2024 వేలానికి మరికొద్దిగంటల్లో తెరలేవనుంది. దుబాయ్ వేదికగా జరుగబోయే ఈ మినీ వేలంలో 77 స్లాట్స్ అందుబాటులో ఉండగా ఫ్రాంచైజీల కన్ను తమ మీద పడేందుకు 333 మంది ఆటగాళ్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 214 మంది భారత్ నుంచి ఉండగా 119 మంది ఓవర్సీస్ (విదేశీ) క్రికెటర్లు ఉన్నారు. మరి 77 మందిని వేలంలో దక్కించుకోవడానికి పది ఫ్రాంచైజీల వద్ద ఉన్న నగదు ఎంత..? ఏ ఫ్రాంచైజీ పర్స్ నిండుగా ఉంది..? అనే వివరాలు ఇక్కడ చూద్దాం..
77 మందిని (ఇందులో 30 స్లాట్స్ విదేశీయులకు కేటాయించినవి) కొనుగోలు చేయడానికి పది ఫ్రాంచైజీల వద్ద రూ. 262.95 కోట్ల నగదుఉంది. ఇందులో అత్యధికంగా గుజరాత్ టైటాన్స్ వద్ద రూ. 38.15 కోట్లు ఉండగా అత్యల్పంగా లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ. 13.15 కోట్లు మాత్రమే మిగిలున్నాయి.
Welcome to Dubai! 🌇
We are all set for the #IPLAuction 🔨
The 🏆 in all its glory ✨#IPL pic.twitter.com/BZ2JpT0awP
— IndianPremierLeague (@IPL) December 17, 2023
– గుజరాత్ టైటాన్స్ – రూ. 38.15 కోట్లు
– సన్ రైజర్స్ హైదరాబాద్ – రూ. 34 కోట్లు
– కోల్కతా నైట్ రైడర్స్ – రూ. 32.7 కోట్లు
– చెన్నై సూపర్ కింగ్స్ – రూ. 31.4 కోట్లు
– పంజాబ్ కింగ్స్ – రూ. 29.1 కోట్లు
– ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 28.95 కోట్లు
– రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ. 23.25 కోట్లు
– ముంబై ఇండియన్స్ – రూ. 17.75 కోట్లు
– రాజస్తాన్ రాయల్స్ – రూ. 14.5 కోట్లు
– లక్నో సూపర్ జెయింట్స్ – రూ. 13.15 కోట్లు