RCB Release List 2026 | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 టైటిల్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది. తొలిసారిగా టైటిల్‌ను గెలుచుకుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టైటిల్‌ను గెలిచి చిరకాల కలను సాకారం చేసుకుంది. మళ్లీ ఆ జట్టు ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగుపెట్టనున్నది. ఈ సారి ఆర్సీబీ జట్టులో పెద్దగా మార్పులు చేసేందుకు ఇష్టపడడం లేదు. అయితే, రాబోయే సీజన్ వేలానికి ముందు ట్రేడ్ విండో ఓపెన్ అయ్యింది. వేలానికి ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకునేందుకు అనుమతి ఇచ్చే ఓ స్పెషల్ సిస్టమ్. ఎలాంటి వేలం లేకుండానే ఆటగాళ్లు ఓ జట్టు నుంచి మరో జట్టుకు మారే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ పలువురు ఆటగాళ్లను విడుదల చేసే అవకాశం ఉంది.
ఈ జాబితాలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ పేరు వినిపిస్తుంది. ఆర్సీబీ ఈ ఆల్‌రౌండర్‌ను విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ అతన్ని రూ.8.75 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లో లివింగ్ స్టోన్ కేవలం 112 మాత్రమే చేశాడు. అంచనాలను అందుకోలేకపోయిన అతన్ని విడుదల చేయాలని ఫ్రాంచైజీ యోచిస్తుంది. ఆర్సీబీలో ఇప్పటికే టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమిరియో షెప్పర్డ్, జాకబ్ బెథెల్, కృనాల్ పాండ్యాతో మిడిలార్డర్ బలంగా ఉంది. దాంతో లివింగ్‌స్టోన్‌ను తప్పించే ఛాన్స్ ఉంది. అదే సమయంలో ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ కలిసి 39 వికెట్ల పడగొట్టి అద్భుతంగా రాణించారు. యష్ దయాల్, రసిక్ సలామ్‌లను విడుదల చేసే అవకాశం ఉంది. టోర్నీ చివరలో యష్ దయాల్ ఫామ్ తగ్గడంతో పాటు ఆఫ్ ఫీల్డ్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇక రసిక్ సలామ్‌ను రూ.6కోట్లకు కొనుగోలు చేసినా.. కేవలం రెండు మ్యాచులు మాత్రమే ఆడాడు. ప్రత్యేకంగా తన ప్రభావాన్ని చూపించలేకపోయాడు.
లివింగ్‌స్టోన్, దయాల్, రసిక్లను విడుదల చేస్తే ఆర్సీబీకి రూ.19.75కోట్లు మిగలనుండగా.. ఈ సొమ్మును మినీవేలంలో వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎవరైనా విదేశీ ఆటగాడు, లేదంటే టీమిండియా రైజింగ్ స్టార్స్‌ను జట్టులోకి తీసుకునేందుకు వీలుంటుందని భావిస్తున్నది. ఇదిలా ఉండగా.. ఆర్సీబీ కీలక ఆటగాళ్లను నిలుపుకుంటున్నది. ఇందులో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ జోడీ హిట్ గత సీజన్లో అయ్యింది.రజత్ పాటిదార్ కెప్టెన్‌గా జట్టును నటిపించాడు. దేవ్‌దత్ పడిక్కల్ మూడవ స్థానంలో రాణించాడు. జితేశ్ శర్మ, మయాంక్ అగర్వాల్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, కృనాల్ పాండ్యా, జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగీ ఎన్గిడి, నువాన్ తుషార, సూర్యశర్మ, స్వస్తిక్ చికారే, స్వప్నిల్ సింగ్, మనోజ్ భాండాంగే ఉన్నారు. లియామ్ లివింగ్‌స్టోన్, యష్ దయాల్, రసిఖ్ సలామ్, మోహిత్ రాఠి, అభినందన్ సింగ్ సింగ్‌ను రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.