IPL 2026 : ఐపీఎల్లో మరో బ్యాటర్ ఔటవ్వడంపై వివాదం రాజుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్(Rajat Patidar) గాల్లోకి లేపిన బంతిని బౌండరీ లైన్ వద్ద జేసన్ హోల్డర్ (Jason Holder) డైవ్ చేస్తూ అందుకున్నాడు. అయితే.. బంతిని ఎడమ చేత్తో అందుకున్న హోల్డర్.. పైకి లేచే సమయంలో అనుకోకుండానే బంతిని నేలకు తాకించాడు. అయినా సరే థర్డ్ అంపైర్ పాటిదార్‌ను ఔటివ్వడం విమర్శలకు తావిస్తోంది.
అసలేం జరిగిందంటే.. ఓవర్లో పటిదార్ సిక్సర్ కొట్టాలనుకున్నాడు. అయితే.. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టేందుకు రబడ, హోల్డర్ పోటీ పడ్డారుచ చివరకు హోల్డర్ ఒడుపుగా బంతిని ఎడమ చేత్తో అందుకున్నాడు. క్యాచ్ పూర్తి చేసే క్రమంలో కింద పడిన అతడు పైకి లేచే సమయంలో ఎడమ చేతిని నేలకు తాకించాడు. అప్పటికి హోల్డర్ చేతిలోనే బంతి ఉండడం.. అది ఔట్ ఎలా అవుతుంది? అని డగౌట్‌లోని ఆర్సీబీ ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు.
🚨Virat Kohli and Andy flower’s fight with Umpires 🚨
– Rajat Patidar OUT on a controversial low catch by Jason Holder.
– Virat Kohli & Andy Flower LOSING it at the umpire Krunal Pandya ready to explode– Out or Not Out ??
pic.twitter.com/zQCmzdGzoX— Indian Cricket (@IPL2025Auction) April 30, 2026
క్యాచ్ పట్టిన తర్వాత హోల్డర్ బంతి నేలకు తాకించినందున ఔట్ ఇవ్వడం సరికాదని అని విరాట్ కోహ్లీ, కోచ్ ఆండీ ఫ్లవర్ అంపైర్‌తో వాదించారు. పాటిదార్ సైతం మైదానం వీడేందుకు తటపాయించాడు. రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ హోల్డర్ పైకి లేచే క్రమంలో అప్రయత్నంగానే బంతిని నేలకు తాకించడాని నిర్ధరించుకుని ఔటిచ్చాడు. అయితే.. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న కూపర్ కొన్నొల్లీ ఇదే తరహాలో బిగ్‌బాష్ లీగ్‌లో క్యాచ్ పట్టగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.
The same Jason Holder type catch taken by Cooper Connolly in BBL was given not out. pic.twitter.com/ckc6OsJF0O
— S@urabh (@___100rabh) April 30, 2026
మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్ గడ్డపై భారీ స్కోర్ కొట్టాలనుకున్న ఆర్సీబీ పాటిదార్ వికెట్ పడడంతో 155కే పరిమితమైంది. స్వల్ప ఛేదనలో శుభ్‌మన్ గిల్(43) రాణించగా గుజరాత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.