IPL 2025 | ఐపీఎల్-2025 తొలి మ్యాచ్‌లోనే హై వోల్టోజ్ డ్రామా కనిపించింది. ఈ మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్ – రాయస్థాన్ రాయల్స్ బెంగళూరు మధ్య జరిగింది. కోల్‌కతా ఇన్నింగ్స్ సమయంలో ఓపెనర్ సునీల్ నరైన్ తన బ్యాట్ స్టంప్స్‌ని తాకగా.. బెయిల్స్ పడిపోయాయి. బెంగళూరు ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. హిట్‌వికెట్ ఇవ్వలేదు. దీనిపై సోషల్ మీడియాలో పలువురు స్పందిస్తున్నారు. నరైన్ అవుట్ అయినా.. అంపైర్ ఇవ్వలేదని పలువురు ఆర్సీబీ అభిమానులు ఆరోపించారు. అయితే, ఎంసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయో చూద్దాం. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సునీల్ నరైన్, క్వింటన్ డికాక్ ఇద్దరూ ఓపెనింగ్‌కు వచ్చారు. హేజిల్‌వుడ్ తొలి ఓవర్లోనే డికాక్‌ను పెవిలియన్‌కు పంపాడు.
— kuchnahi123@12345678 (@kuchnahi1269083) March 22, 2025
ఆ తర్వాత కెప్టెన్ అజింకయ రహానేతో కలిసి రెండో వికెట్ నరైన్ 105 పరుగులు జోడించాడు. ఆర్సీబీ బౌలర్ రసిఖ్ సలాం ఇన్నింగ్స్ ఏడో ఓవర్ బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ఓవర్లో రషిక్ వేసిన షార్ట్ బాల్‌ను వదిలేశాడు. ఆ బాల్ని వదిలేసిన నరైన్.. బ్యాట్ స్టంప్స్‌కి తగిలి.. బెయిల్స్ పడిపోయాయి. ఆ బాల్‌ను లెగ్ అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. వికెట్ కీపర్ జితేష్ శర్మ బంతిని తన గ్లోవ్స్‌లోకి తీసుకున్నాడు. అంటే నరైన్ బంతిని ఆడటానికి తన ప్రయత్నం చేశాడు. బంతి వికెట్ కీపర్ వద్దకు వెళ్లడంతోనే అంపైర్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే డెడ్‌బాల్ అయ్యింది. ఎంసీసీ క్రికెట్ రూల్స్ ప్రకారం.. ఎంసీసీ నిబంధనల ప్రకారం, బ్యాటర్ బంతిని ఆడేటప్పుడు లేదంటే.. పరుగులు తీసే సమయంలో బ్యాట్ వికెట్లను తాకితేనే హిట్ వికెట్‌గా పరిగణిస్తారు.
Isn’t it a hit wicket?? 👀@grok what’s your thoughts? #RCBvsKKR #KKRvsRCB #IPL2025 pic.twitter.com/AVIBLsbj0l
— Skilled Insaan (@skilledinsaan) March 22, 2025
ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్‌లో బంతి నరైన్ పైనుంచి వెళ్లి కీపర్ చేతిలో పడిన అనంతరం బ్యాట్ వికెట్లను తాకింది. అప్పటికే అంపైర్ ఆ బంతిని వైడ్‌బాల్‌గా ప్రకటించారు. బంతి వికెట్ కీపర్ గ్లోవ్స్‌లోకి వెళ్లి డెలివరీ పూర్తికావడం.. ఆ తర్వాత నరైన్ బ్యాట్ స్టంప్స్‌ను తాకడంతో అంపైర్లు రూల్ 35.2 ప్రకారం నాటౌట్‌గా ప్రకటించారు. ఉదాహరణకు, చాలాసార్లు వికెట్పైనున్న బెయిల్స్ కిందపడిన సందర్భంలో బ్యాట్స్‌మెన్ తీసుకొని స్టంప్స్‌పై పెట్టడం తెలిసిందే. సరిగ్గా ఇది కూడా అలాంటిదే. బంతి వికెట్ కీపర్ గ్లోవ్స్‌లోకి వెళ్లిన తర్వాత డెడ్‌గా ప్రకటించారు. ఇక ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. కృనాల్ పాండ్యా, జోష్ హాజిల్‌వుడ్ అద్భుతమైన బౌలింగ్, విరాట్ కోహ్లీ (59 నాటౌట్), ఫిల్ సాల్ట్ (56) దూకుడుగా బ్యాటింగ్ తో 18వ ప్రారంభ మ్యాచ్‌లో బెంగళూరు ఏడు వికెట్ల తేడాతో కేకే ఆర్‌పై విజయం సాధించింది.