ముంబై : పొట్టి క్రికెట్ పండుగ ఐపీఎల్ – 2025కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఈ వారంలోనే విడుదలవనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 6న ఇంగ్లండ్‌తో తొలి వన్డే ముగిసిన అనంతరం బీసీసీఐ.. ఐపీఎల్-18 షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశమున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. మార్చి 21న మొదలై మే 25న ముగియనున్న ఈ మెగా లీగ్‌లో 74 మ్యాచ్‌లున్నాయి.