IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఓటమిపాలైంది. ఆ తర్వాత ముంబయి జట్టు యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అశ్విని కుమార్, విఘ్నేష్ పుత్తూరు వంటి యువ ఆటగాళ్లు తీసుకువచ్చినందుకు ప్రశంసలు అందుకున్న జట్టు యాజమాన్యం తిలక్ వర్మ వంటి స్టార్ ఆటగాడిని నమ్మకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వెనుక హార్దిక్ పాండ్యా ఉన్నాడని అనుకున్నారు. కానీ, ముంబయి కోచ్ మహేల జయవర్ధనే ముందుకు వచ్చి.. క్లారిటీ ఇచ్చాడు. తిలక్ వర్మ రిటైర్డ్‌హర్ట్ వెనుక తన నిర్ణయమేనని తెలిపాడు. లక్నోతో మ్యాచ్‌లో ముంబయి ఇన్నింగ్స్ 19వ ఓవర్లో తిలక్ వర్మ రిటైర్ అవుట్ అయి పెవిలియన్‌కు చేరాడు.
🚨 A RARE SCENE IN CRICKET. 🚨
– Tilak Varma who came in as an impact player, retired out before the final over. 🤯 pic.twitter.com/oqg6JwRNiV
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2025
దాంతో అందరూ షాక్ అయ్యారు. తిలక్ ఏమైందని ఆరా తీశారు. ఆ తర్వాత మిచెల్ శాంట్నర్ క్రీజులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా మైదానంలోకి వచ్చి.. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీనిపై జయవర్ధనే మాట్లాడుతూ.. తిలక్ వర్మ 23 బంతుల్లో 25 పరుగులు చేశాడు. తిలక్ మైదానంలో చాలా సమయం గడిపినా బంతిని కొట్టేందుకు ఇబ్బందిపడుతున్నట్లుగా జయవర్ధనే తెలిపాడు. డెత్ ఓవర్లలో కొత్త బ్యాట్స్‌మెన్‌కు అవకాశం ఇవ్వాలని అనుకున్నానని.. తిలక్ తమ తరఫున బాగానే బ్యాటింగ్ చేశాడని.. మూడో వికెట్ కోల్పోయినప్పుడు.. సూర్య కుమార్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడని తెలిపాడు. తిలక్ భారీ షాట్లు ఆడాలని అనుకున్నాడని.. అలా చేయలేకపోయాడని తెలిపాడు. మైదానంలో ఎక్కువ సమయం ఉన్నందని హిట్టింగ్ చేయగలగాలని చెప్పాడు.
🚨 A RARE SCENE IN CRICKET. 🚨
– Tilak Varma who came in as an impact player, retired out before the final over. 🤯 pic.twitter.com/oqg6JwRNiV
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2025
తిలక్ ఇబ్బందిపడుతున్నందున కొత్త ఆటగాడు అవసరమని భావించినట్లు తెలిపాడు. ఇది క్రికెట్లో జరుగుతుందని.. అతన్ని అలా పిలిచేందుకు ఇష్టం లేకపోయినా.. ఆ సమయంలో వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు. తిలక్ పెవిలియన్‌కు వస్తున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ అసంతృప్తిగా కనిపించగా.. జయవర్ధనే అతని వద్దకు వెళ్లి ఏదో చెప్పాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కూడా బ్యాట్‌తో అద్భుతంగా ఏమీ చేయలేకపోయాడు. 16 బంతుల్లో 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీసినా.. ముంబయిని గెలిపించలేకపోయాడు. పవర్ ప్లేలో బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చారని.. హార్దిక్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడని తెలిపారు. ముంబయిని లక్నో 12 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 203 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ముంబయికి 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేయగలిగింది.