ముంబై : ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ముంబై ఇండియన్స్.. త్వరలో తమ జట్టును వీడనున్న ముగ్గురు విదేశీ ఆటగాళ్ల స్థానాన్ని భర్తీ చేసింది. ఈనెల 26 తర్వాత ముంబై ఆటగాళ్లు విల్ జాక్స్, రికెల్టన్, కార్బిన్ బోష్ ఆ జట్టును వీడనున్నారు.
ఈ నేపథ్యంలో వారి స్థానాలను జానీ బెయిర్ స్టో, రిచర్డ్ గ్లెసన్, చరిత్ అసలంకతో భర్తీ చేయనున్నట్టు ఆ జట్టు తెలిపింది.