IPL 2025 Mega Auction | ఐపీఎల్ మెగా వేలం కొనసాగుతున్నది. పలువురు ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. ఊహించినట్లుగానే రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. ఇక ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతన్ని రైట్ టూ మ్యాచ్ కార్డ్‌ని ఉపయోగించి పంజాబ్ కింగ్స్ రూ.18కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అతన్ని రూ.16.75కోట్లకు బిగ్ వేసింది. అర్ష్‌దీప్ సింగ్ వేలానికి రాగానే మొదట చెన్నై సూపర్ కింగ్స్ బిడ్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత అతని కోసం చెన్నై సైతం పోటీ పడింది. ఆ తర్వాత గుజరాత్, రాజస్థాన్ జట్లు సైతం పోటీపడ్డాయి. చివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.15.75కోట్లకు బిడ్ వేసింది.
ఆ తర్వాత పంజాబ్ అర్ష్‌దీప్ కోసం రైట్ టూ మ్యాచ్ కార్డ్‌తో తీసుకునేందుకు ఆసక్తిని వ్యక్తం చేసింది. రూ.18కోట్లకు హైదరాబాద్ ఆఫర్ చేయగా.. అందుకు పంజాబ్ అంగీకరించింది. వాస్తవానికి గత సీజన్లో అర్ష్‌దీప్ పంజాబ్ జట్టులోనే కొనసాగాడు. అతన్ని రిలీవ్ చేసింది. తాజాగా అదే జట్టు మళ్లీ అతన్ని తీసుకున్నది. అర్ష్‌దీప్ 2024 టీ20 ప్రపంచకప్ జట్టులో సబ్యుడు. టీ20ల్లో బౌలింగ్‌తో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అర్ష్‌దీప్ మంచి ప్రదర్శన చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ ఐపీఎల్ కెరీర్‌ను పరిశీలిస్తే.. 65 మ్యాచ్‌ల్లో 76 వికెట్లు పడగొట్టాడు. ఈ లెఫ్టార్మ్ బౌలర్ 2022లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అతను ఇప్పటివరకు ఆడిన 60 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 95 వికెట్లు తీశాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో యుజ్వేంద్ర చాహల్‌కు కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.