SRH vs GT | ఐపీఎల్ సీజన్లో భాగంగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగో వికెట్ కోల్పోయింది. 14 ఓవర్లో హెన్రిచ్ క్లాసెస్ (24 ) ఔటయ్యాడు.
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ పదో ఓవర్లోపే మూడు వికెట్లను కోల్పోవడంతో జోరును తగ్గించింది. హెన్రిచ్ క్లాసెస్, మార్క్రమ్ ఇద్దరూ నిలకడగా ఆడుతున్న సమయంలోనే క్లాసెస్ వికెట్‌ను కూడా కోల్పోయింది. అంతకుముందు ఐదో ఓవర్లోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఐదో ఓవర్లో రెండో బంతికి మయాంక్ అగర్వాల్ (16) ఔటయ్యాడు. ఏడో ఓవర్లో నాలుగో బంతికి ట్రావిస్ హెడ్ (19) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పదో ఓవర్లో అభిషేక్ శర్మ (29) కూడా ఔటయ్యాడు. 14 ఓవర్లకు సన్‌రైజర్స్ నాలుగు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది.