IPL 2024 Retentions: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 2024 వేలానికి ముందు పది ఫ్రాంచైజీలు నేడు వచ్చే సీజన్లో తాము తమ వద్దే అట్టిపెట్టుకుని (రిటైన్డ్), వేలానికి వదిలేసిన (రిలీజ్) వారి జాబితాను ప్రకటించాయి. పలు జట్లు ప్రక్షాళన దిశగా సాగగా మరికొన్ని జట్లు మాత్రం తమ ఆటగాళ్లపై నమ్మకముంచి గత సీజన్లో విఫలమైన పలువురు ఆటగాళ్లను వదిలేశాయి. అన్నింటికీ మించి గత కొన్ని రోజులుగా అత్యంత చర్చనీయాంశమైన గుజరాత్ టైటాన్స్ సారథి హార్ధిక్ పాండ్యా బదిలీ ప్రక్రియలో మాత్రం ఎవరూ ఊహించని విధంగా జరుగుగా, వచ్చే సీజన్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మహేంద్ర సింగ్ ధోని ఆడనుండటం విశేషం. నేడు పది ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాను ఇక్కడ చూద్దాం.
ముంబై ఇండియన్స్ వదులుకున్న ఆటగాళ్లుః అర్షద్ ఖాన్, రమణ్దీస్ సింగ్, హృతిక్ షోకీన్, రాఘవ్ గోయల్, జోఫ్రా ఆర్చర్, ట్రిస్టన్ స్టబ్స్, డువాన్ జాన్సెన్, జై రిచర్డ్సన్, రిలే మెరిడిత్, క్రిస్ జోర్డాన్, సందీప్ వారియర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుః వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హెజిల్వుడ్, ఫిన్ అలెన్, మైఖేల్ బ్రాస్‌వెల్, డేవిడ్ విల్లే, వేన్ పార్నెల్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ కౌల్, కేదార్ జాదవ్
కోల్‌కతా నైట్ రైడర్స్ః షకిబ్ అల్ హసన్, లిటన్ దాస్, ఆర్యా దేశాయ్, డేవిడ్ వీస్, నారాయణ్ జగదీశన్, మన్దీప్ సింగ్, కుల్వంత్ ఖెజ్రొలియా, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, జాన్సన్ ఛార్లెస్
చెన్నై సూపర్ కింగ్స్ః బెన్ స్టోక్స్, డ్వేన్ ప్రిటోరియస్, కైల్ జెమీసన్, ఆకాశ్ సింగ్, అంబటి రాయుడు (గతేడాదే రిటైర్మెంట్ ప్రకటించాడు) సిసంద మగల, భగవత్ వర్మ, సుభ్రాన్షు సేనాపతి
Sunrisers Hyderabad retained & released players. [Star Sports] pic.twitter.com/Z5lr4xgaGa
— Johns. (@CricCrazyJohns) November 26, 2023
గుజరాత్ టైటాన్స్ః యశ్ దయాల్, కె.ఎస్. భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, ప్రదీప్ సంగ్వాన్, ఒడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, దసున్ శనక
సన్ రైజర్స్ హైదరాబాద్ః హ్యారీ బ్రూక్, సమర్థ్ వ్యాస్, కార్తీక్ త్యాగి, వివ్రంత్ శర్మ, అకీల్ హోసెన్, అదిల్ రషీద్
పంజాబ్ కింగ్స్ః షారుక్ ఖాన్, రాజ్ బవ, బెల్తెజ్ దండ, మోహిత్ రాతి, భానుక రాజపక్స
లక్నో సూపర్ జెయింట్స్ః డానియల్ సామ్స్, కరుణ్ నాయర్, జయదేవ్ ఉనద్కత్, మనన్ వోహ్రా, కరణ్ శర్మ, సూర్యాన్ష్ షెడ్గె, స్వప్నీల్ సింగ్, అర్పిత్ గులెరియా, రొమారియా షెపర్డ్ (ముంబైకి బదిలీచేసింది), అవేశ్ ఖాన్ (రాజస్తాన్‌కు బదిలీ చేసింది)
రాజస్తాన్ రాయల్స్ః మురుగన్ అశ్విన్, కెసి కరియప్ప, కెఎం ఆసిఫ్, ఆకాశ్ వశిష్ట్, అబ్దుల్లా బాసిత్, కుల్దీప్ యాదవ్, జో రూట్, జేసన్ హోల్డర్, ఒబెడ్ మెక్కాయ్
Mumbai retained & released players list. [Star Sports] pic.twitter.com/ED12VThYBD
— Johns. (@CricCrazyJohns) November 26, 2023
ఢిల్లీ క్యాపిటల్స్ః రిలీ రొసో, చేతన్ సకారియా, రొవ్మన్ పావెల్, మనీష్ పాండే, ఫిల్ సాల్ట్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కమలేష్ నాగర్కోటి, రిపల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, అమన్ ఖాన్, ప్రియమ్ గార్గ్