MI vs KKR | ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ముంబై, కోల్‌కతా జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్‌ను ఎంచుకుంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌లు గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కాగా ఆడిన 10 మ్యాచ్‌ల్లో మూడింట్లో మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్.. అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది.
ముంబై జట్టు :
ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నేహాల్ వదేరా, హార్దిక్ పాండ్యా, నమన్ ధిర్, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కొయిట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారా
కోల్‌కతా జట్టు:
ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్, అంగ్కృష్ణ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి