IPL 2024 Auction: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మినీ వేలంలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ. 24.75 కోట్ల ధర పెట్టి దక్కించుకుంది. స్టార్క్ కోసం తొలుత ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీపడగా రూ. 10 కోట్ల విలువ దాటిన తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్‌లు సీన్లోకి వచ్చాయి. ఈ కంగారూ పేసర్‌ను దక్కించుకోవడానికి రెండు జట్లూ పోటాపోటీగా బిడ్ వేశాయి. రెండు జట్ల ప్రతినిధులు ఎక్కడా తగ్గకపోవడంతో స్టార్క్ ఐపీఎల్లో ఇంతవరకూ ఏ ఆటగాడూ దక్కించుకోని ధరను సొంతం చేసుకున్నాడు. కానీ స్టార్క్‌కు రూ. 24 కోట్లు పెట్టేంత సీన్ ఉందా..? ఐపీఎల్లో అంతంతమాత్రంగానే ఆడిన ఈ ఆసీస్ పేసర్‌ను దక్కించుకోవడం క్రేజా..? వెర్రితనమా..?
ఐపీఎల్లో స్టార్క్ 2014లో ఎంట్రీ ఇచ్చాడు. తొలి రెండు సీజన్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడాడు. ఆ రెండు సీజన్లలో కలిపి 27 మ్యాచ్‌లు ఆడిన స్టార్క్.. తీసింది 34 వికెట్లు. కానీ ఆ తర్వాత 2016లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే గాయం కారణంగా సీజన్ నుంచి తప్పుకున్నాడు. 2017లో వ్యక్తిగత కారణాలతో లీగ్‌కు దూరంగా ఉన్నాడు. 2018లోనూ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత దేశం కోసం తప్ప ఐపీఎల్లో ఆడబోనని గీత గీసుకుని ఈ లీగ్‌కు దూరంగా ఉన్నాడు. కానీ కెరీర్ చివర్లో ఉన్న స్టార్క్.. వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు ఐపీఎల్‌ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాడనేది బహిరంగ రహస్యమే..
Surreal 🫣
INR 24.75 Crore 💰#KKR fans, make way for Mitchell Starc who’s ready to bowl in 💜💛#IPLAuction | #IPL pic.twitter.com/E6dfoTngte
— IndianPremierLeague (@IPL) December 19, 2023
ఇటీవల ఆస్ట్రేలియా ఆడే మేజర్ టీ20 సిరీస్‌లలో తప్ప స్టార్క్ పొట్టి క్రికెట్ ఆడింది కూడా తక్కువే. ఎక్కువగా టెస్టులు, వన్డేల మీదే దృష్టిసారించిన స్టార్క్‌కు ఐపీఎల్లో గొప్ప రికార్డులు కూడా ఏమీలేవు. రెండు సీజన్లు ఆడినా అంతగా ప్రభావం చూపిందైతే లేదు. కానీ మన ఫ్రాంచైజీలు మాత్రం ఈ కంగారూ పేసర్ ను దక్కించుకోవడానికి క్యూ కట్టాయి. 2018లో ఇదే కేకేఆర్.. అతడిని రూ. 9.4 కోట్లు పెట్టి దక్కించుకున్నా అతడు గాయం కారణంగా సీజన్ నుంచి తప్పుకోవడంతో నిరాశచెందింది. ఆ అనుభవమున్నా ఈ సీజన్లో స్టార్క్‌పై కోట్లు కుమ్మరించడం గమనార్హం.
MITCHELL STARC SOLD AT 24.75 CRORE to KKR!!!
He hasn’t played IPL in last 7 years, yet STARC BECAME THE MOST EXPENSIVE PLAYER IN IPL HISTORY.
He has the stats and streets both. 🔥🔥 pic.twitter.com/DRBXdp0S1m
— retired ICT fan (@ViratCrazyDK) December 19, 2023
రెడ్ బాల్ క్రికెట్లో స్టార్క్ బౌలింగ్ పై ఎవరికీ సందేహమే లేకున్నా పొట్టి క్రికెట్లో మాత్రం అతడికి అంత గొప్ప రికార్డు లేదు. అంతర్జాతీయ స్థాయిలో టీ20లలో 58 మ్యాచ్‌లు ఆడితే అతడు తీసింది 73 వికెట్లే. గతంలో మాదిరిగానే స్టార్క్.. రెండు మూడు మ్యాచ్‌లు ఆడి గాయమైందని తిరిగి ఇంటికి వెళ్లిపోతాడని, అప్పుడు కేకేఆర్‌కు తెలిసొస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ వాపోతున్నారు. ఈ ధరలో కేకేఆర్‌కు స్టార్క్ కంటే మెరుగైన బౌలర్లు దొరికేవారని అనేవాళ్లూ లేకపోలేదు. మరి కేకేఆర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో…!
KKR after buying Mitchell Starc pic.twitter.com/M9zxolQXU6
— Sagar (@sagarcasm) December 19, 2023
pic.twitter.com/NW1g5PgzGy
3 Consecutive Fours Against Mitchell Starc in a World Cup final.🤙🏻🥵🥵— Hassan (@122atdubai) December 14, 2023