IPL 2023 : IPL 2023 : ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠ పోరు అభిమానులను అలరించింది. కానీ, హైదరాబాద్ మరోసారి విజయం ముంగిట బొక్కా బోర్లాపడి ఫ్యాన్స్‌ను నిరాశ పరిచింది. బౌలర్లు రాణించడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది.కెప్టెన్ మరక్రం(41), హెన్రిచ్ క్లాసెన్(34) ఉన్నంత సేపు హైదరాబాద్ పోటీలో ఉంది. వాళ్లు ఔటయ్యాక అబ్దుల్ సమద్(21) పోరాడాడు. కానీ, ఆఖరి ఓవర్లో వరుణ్ చక్రవర్తి 3 పరుగులే ఇచ్చాడు. దాంతో, మరక్రం సేన 166 రన్స్‌కే పరిమితమైంది.
#KKR clinch a nail-biter here in Hyderabad as Varun Chakaravarthy defends 9 runs in the final over.@KKRiders win by 5 runs.
Scorecard – https://t.co/dTunuF3aow #TATAIPL #SRHvKKR #IPL2023 pic.twitter.com/g9KGaBbADy
— IndianPremierLeague (@IPL) May 4, 2023
వరుణ్ చక్రవర్తి వేసిన 20వ ఓవర్లో 9 పరుగులు అవసరమయ్యాయి. రెండు బంతులకు రెండు రన్స్ వచ్చాయి. మూడో బంతికి అబ్దుల్ సమద్(21) ఔటయ్యాడు. ఆఖరి బంతికి భువనేశ్వర్(5) ఒక్క పరుగు తీయలేదు. దాంతో, కోల్‌కతా 5 పరుగుల తేడాతో గెలుపొందింది.
వరుణ్ చక్రవర్తి ఓవర్లో అబ్దుల్ సమద్(15)రెండు రన్స్ తీశాడు. దాంతో, హైదరాబాద్ స్కోర్ 150 దాటింది. మార్కో జాన్సెన్ (1) ఆడుతున్నాడు. 18 ఓవర్లకు స్కోర్.. 151/6 హైదరాబాద్ విజయానికి 12 బంతుల్లో 21 పరుగులు కావాలి.
హైదరాబాద్ ఆరో వికెట్ పడింది. కెప్టెన్ మరక్రం(41) ఔటయ్యాడు. వైభవ్ అరోరా ఓవర్లో రింకూ సింగ్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. మార్కో జాన్సెన్ వచ్చాడు. అబ్దుల్ సమద్(13) ధనాధన్ ఆడుతున్నాడు. 17 ఓవర్లకు స్కోర్.. 146/6 హైదరాబాద్ విజయానికి 18 బంతుల్లో 26 పరుగులు కావాలి.
ధాటిగా ఆడుతున్నహెన్రిచ్ క్లాసెన్(36) ఔటయ్యాడు. శార్దూల్ ఓవర్లో బౌండరీ వద్ద రస్సెల్ చేతికి చిక్కాడు. దాంతో, 70 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అబ్దుల్ సమద్ వచ్చాడు. కెప్టెన్ మరక్రం(33) ఆడుతున్నాడు.
హెన్రిచ్ క్లాసెన్(34), కెప్టెన్ మరక్రం(25) ఐదో వికెట్‌కు 50 రన్స్ జోడించారు. 13 ఓవర్లకు స్కోర్.. 114/4 హైదరాబాద్ విజయానికి 42 బంతుల్లో 58 పరుగులు కావాలి.
50-run partnership comes up between Aiden Markram and Heinrich Klaasen.
Live - https://t.co/dTunuF3aow #TATAIPL #SRHvKKR #IPL2023 pic.twitter.com/FNwz6fH1sU
— IndianPremierLeague (@IPL) May 4, 2023
హెన్రిచ్ క్లాసెన్(25) వీర బాదుడు బాదుతున్నాడు. అనుకుల్ రాయ్ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు బాదాడు. 15 పరుగులు వచ్చాయి. కెప్టెన్ మరక్రం(11) ఆడుతున్నాడు. 11 ఓవర్లకు స్కోర్.. 90/4
అనుకుల్ రాయ్ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయంతే. హెన్రిచ్ క్లాసెన్(8), కెప్టెన్ మరక్రం(7) నిలకడగా ఆడుతున్నారు. 9 ఓవర్లకు స్కోర్.. 69/4
హైదరాబాద్ నాలుగో వికెట్ పడింది. అనుకుల్ రాయ్ ఓవర్లో హ్యారీ బ్రూక్(0) ఎల్బీగా ఔటయ్యాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో కోల్‌కతా రివ్యూ తీసుకుని వికెట్ సాధించింది. హెన్రిచ్ క్లాసెన్ వచ్చాడు.
Anukul Roy picks up the wicket of Harry Brook, who is given out LBW!
SRH lose their fourth.
Live - https://t.co/dTunuF3aow #TATAIPL | #SRHvKKR pic.twitter.com/LGF2fn6vwC
— IndianPremierLeague (@IPL) May 4, 2023
హైదరాబాద్ మూడో వికెట్ పడింది. ఇంపాక్ట్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి(20) ఔటయ్యాడు. ఆండ్రూ రస్సెల్ ఓవర్లో వైభవ్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఆ ఓవర్లో త్రిపాఠి తొలి బంతికి ఫోర్ కొట్టాడు. ఫ్రీ హిట్‌ను స్టాండ్స్‌లోకి పంపాడు. రెండో బంతికి బౌండరీ బాదాడు. హ్యారీ బ్రూక్(0) వచ్చాడు. మరక్రం(0) ఆడుతున్నారు. ఆరు ఓవర్లకు స్కోర్.. 53/3
హైదరాబాద్‌కు షాక్ .. ఓపెనర్ అభిషేక్ శర్మ(9) ఔటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ ఓవర్లో షాట్ ఆడి రస్సెల్‌కు చిక్కాడు. దాంతో, హైదరాబాద్ రెండు వికెట్లు కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి(5) ఆడుతున్నాడు.
WATCH 👇👇@imShard picks up his first wicket of the game. Abhishek Sharma goes a long way up in the air towards square leg where Dre Russ gets under it and completes a good catch.
Live - https://t.co/dTunuF3aow #TATAIPL #SRHvKKR #IPL2023 pic.twitter.com/DWmI1BOxzq
— IndianPremierLeague (@IPL) May 4, 2023
ఓపెనర్ మయాంక్ అగర్వాల్(18) ఔటయ్యాడు. ఐదో బంతికి కీపర్ గుర్బాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మూడో బంతికి మయాంక్ 69 మీటర్ల సిక్స్ కొట్టాడు. అభిషేక్ శర్మ(6) ఆడుతున్నాడు.
Harshit Rana picks up the wicket of Mayank Agarwal, who departs after scoring 18 runs.
Live - https://t.co/dTunuF3aow #TATAIPL #SRHvKKR #IPL2023 pic.twitter.com/KffGuk5Ayt
— IndianPremierLeague (@IPL) May 4, 2023
వైభవ్ అరోరా వేసిన రెండో ఓవర్లో మయాంక్ అగర్వాల్(12) రబౌండరీ కొట్టాడు. 9 పరుగులు వచ్చాయి. అభిషేక్ శర్మ(6) థర్డ్ మ్యాన్ దిశగా ఫోర్ బాదాడు.13 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లకు స్కోర్.. 22/0
హర్షిత్ రానా వేసిన తొలి బంతికే అభిషేక్ శర్మ(5) బౌండరీ కొట్టాడు. మయాంక్ అగర్వాల్(2) ఆడుతున్నాడు. 9 పరుగులు వచ్చాయి.
నటరాజన్ వేసిన 20వ ఓవర్లో రెండో బంతికి సిక్సర్ల కింగ్ రింకూ సింగ్(46) ఔటయ్యాడు. అద్దుల్ సమద్ క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. మూడో బంతికి హర్షిత్ రానా(0) రనౌటయ్యాడు. వైభవ్ అరోరా(2) ఆఖరి బంతికి రెండు పరుగులు తీశాడు. దాంతో, 9 వికెట్ల నష్టానికి కోల్‌కతా 171 రన్స్ కొట్టింది. ఇంపాక్ట్ ప్లేయర్ అనుకుల్ రాయ్(13) నాటౌట్‌గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, జాన్సెన్ రెండేసి వికెట్లు తీశారు. మరక్రం, భువనేశ్వర్, మార్కండేలకు ఒక్కో వికెట్ దక్కింది.
సిక్సర్ల కింగ్ రింకూ సింగ్(46) ఔటయ్యాడు. నటరాజన్ ఓవర్లో అద్దుల్ సమద్ క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు.
ఇంపాక్ట్ ప్లేయర్ అనుకుల్ రాయ్(12) స్పీడ్ పెంచాడు. భువనేశ్వర్ ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. రింకూ సింగ్(46) ఆడుతున్నాడు. 19 ఓవర్లకు స్కోర్.. 168/7.
శార్థూల్ ఠాకూర్(8) ఔటయ్యాడు. నటరాజన్ ఓవర్లో అద్దుల్ సమద్ క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. రింకూ సింగ్(41) ఆడుతున్నాడు. అనుకుల్ రాయ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు.
మార్కండే ఓవర్లో రింకూ సింగ్(37) రెచ్చిపయాడు. లాంగాన్‌లో భారీ సిక్స్ కొట్టాడు. శార్థూల్ ఠాకూర్(8) ఆడుతున్నాడు. 17 ఓవర్లకు స్కోర్.. 148/6.
కోల్‌కతా ఆరో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో సునీల్ నరైన్(1) వెనుదిరిగాడు. మయాంక్ అగర్వాల్ క్యాచ్ పట్టడంతో అతను ఔటయ్యాడు. రింకూ సింగ్(29) ఆడుతున్నాడు. 15.3 ఓవర్లకు స్కోర్.. 130/6.
కోల్‌కతా సగం వికెట్లు కోల్పోయింది. డేజంరస్ ఆండ్రూ రస్సెల్(24) ఔటయ్యాడు. మార్కండే ఓవర్లో నటరాజన్ క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. రింకూ సింగ్(27) ఆడుతున్నాడు.
The smile says it ALL! ☺️@MarkandeMayank scalps the big wicket of Andre Russell! 👍 👍
Follow the match ▶️ https://t.co/xYKXAE6fNI#TATAIPL | #SRHvKKR | @SunRisers pic.twitter.com/yf5SoGhyB4
— IndianPremierLeague (@IPL) May 4, 2023
మరక్రం బౌలింగ్‌లో రింకూ సింగ్(17) వరుసగా రెండు ఫోర్లు బాదాడు. నితీశ్ రానా(24) దాంతో, కోల్‌కతా స్కోర్ 60 దాటింది. ఆడుతున్నాడు. 9 ఓవర్లకు స్కోర్.. 73/3.
నటరాజన్ బౌలింగ్‌లో నితీశ్ రానా(22) సిక్స్ బాదాడు. దాంతో, కోల్‌కతా స్కోర్ 60 దాటింది. రింకూ సింగ్(8) ఆడుతున్నాడు. 8 ఓవర్లకు స్కోర్.. 61/3.
మార్కో జాన్సెన్ వేసిన ఆరో ఓవర్ మొదటి బంతికి నితీశ్ రానా(12) ఫోర్ బాదాడు. రింకూ సింగ్(6) ఆడుతున్నాడు. ఆరు ఓవర్లకు స్కోర్.. 49/3.
కార్తిక్ త్యాగి బిగ్ వికెట్ తీశాడు. డేంజరస్ జేసన్ రాయ్(20)ను ఔట్ చేశాడు. నాలుగో బంతికి రాయ్ షాట్ ఆ ఆడాడు. కానీ, థర్డ్ మ్యాన్‌లో మయాంక్ అగర్వాల్ క్యాచ్ పట్టడంతో కోల్‌కతా మూడో వికెట్ పడింది. రింకూ సింగ్ వచ్చాడు. నితీశ్ రానా(5) ఆడుతున్నాడు.
#KKR 3 down as Jason Roy departs!
Kartik Tyagi strikes in his first over as @mayankcricket takes the catch 👏 👏
Follow the match ▶️ https://t.co/xYKXAE6NDg#TATAIPL | #SRHvKKR pic.twitter.com/2R8oQ6Nd3S
— IndianPremierLeague (@IPL) May 4, 2023
మార్కో జాన్సెన్ ఓవర్లో నో బాల్‌ను నితీశ్ రానా(5) లెగ్ సైడ్ ఫోర్ బాదాడు. జేసన్ రాయ్(14) ఆడుతున్నాడు. నాలుగు ఓవర్లకు స్కోర్.. 27/2.
మార్కో జాన్సెన్ దెబ్బకు కోల్‌కతా ఓకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి రహ్మనుల్లా గుర్బాజ్(0)ఔట్ కాగా, ఆఖరి బంతికి వెంకటేశ్ అయ్యర్(7) వెనుదిరిగాడు. కీపర్ క్లాసెన్ అద్భుత క్యాచ్ పట్టడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసింది. నితీశ్ రానా వచ్చాడు. జేసన్ రాయ్(8) ఆడుతున్నాడు. రెండు ఓవర్లకు స్కోర్.. 16/2.
Early success alert 🚨
Two wickets in an over for Marco Jansen & @SunRisers 💪🏻#KKR lose Rahmanullah Gurbaz & Venkatesh Iyer.
Follow the match ▶️ https://t.co/xYKXAE6NDg#TATAIPL | #SRHvKKR pic.twitter.com/wl7tG7bwNG
— IndianPremierLeague (@IPL) May 4, 2023
కోల్‌కతాకు షాక్.. మార్కో జాన్సెన్ వేసిన రెండో ఓవర్లో రహ్మనుల్లా గుర్బాజ్(0) ఔటయ్యాడు. లాంగాన్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన అతను బ్రూక్ చేతికి చిక్కాడు. దాంతో, 8 పరుగుల వద్ద కోల్‌కతా తొలి వికెట్ పడింది. వెంకటేశ్ అయ్యర్ వచ్చాడు. జేసన్ రాయ్(8) ఆడుతున్నాడు.
భువనేశ్వర్ వేసిన మొదటి ఓవర్లో జేసన్ రాయ్(8) వరుసగా రెండు ఫోర్లు బాదాడు. రహ్మనుల్లా గుర్బాజ్(0) ఆడుతున్నాడు.
హైదరాబాద్ సబ్స్టిట్యూట్స్ : రాహుల్ త్రిపాఠి, వివ్రాంత్ శర్మ, గ్లెన్ ఫిలిఫ్స్, నితిశ్ రెడ్డి, సన్వీర్ సింగ్.
కోల్‌కతా సబ్స్టిట్యూట్స్ : సుయాశ్ శర్మ, , అనుకుల్ రాయ్, జగదీశన్, ఫెర్గూసన్, కుల్వంత్ ఖేజ్రోలియా.
A look at the Playing XIs of both the sides 👌👌
Follow the match ▶️ https://t.co/xYKXAE6NDg#TATAIPL | #SRHvKKR pic.twitter.com/SqfiY1czOH
— IndianPremierLeague (@IPL) May 4, 2023
హైదరాబాద్ : మరక్రం(కెప్టెన్), అభిషేక్ శర్మ, హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, కార్తిక్ త్యాగి, మార్కో జాన్సెన్, నటరాజన్.
కోల్‌కతా : నితీశ్ రానా(కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్) జేసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రూ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, శార్థూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రానా.
టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ నితీశ్ రానా బ్యాటింగ్ తీసుకున్నాడు. దాంతో హైదరాబాద్ మొదట ఫీల్డింగ్ చేయనుంది.
కోల్‌కతా జట్టు కొత్త ప్లేయర్‌ను తీసుకుంది. ఈమధ్యే స్వదేశానికి వెళ్లిన బంగ్లాదేశ్ క్రికెటర్ లిట్టన్ దాస్ ప్లేస్‌లో వెస్డిండీస్ విధ్వంసక ప్లేయర్ జాన్సన్ చార్లెస్‌కు చోటు కల్పించింది. రూ.50 లక్షల కనీస ధరకు అతడితో ఒప్పందం చేసుకుంది. మార్చిలో దక్షిణాఫ్రికాపై చార్లెస్ చెలరేగాడు. కేవలం 46 బంతుల్లోనే 116 పరుగులు చేశాడు.
🚨 NEWS 🚨@KKRiders name Johnson Charles As Replacement For Litton Das.
Details 🔽 #TATAIPLhttps://t.co/YlXMvvsRhp pic.twitter.com/0Qtiiseqw4
— IndianPremierLeague (@IPL) May 4, 2023