IPL 2023 : సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్ గర్జించింది. వరుస ఓటములకు గుడ్ బై చెప్పింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై రెండో విజయం నమోదు చేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(77) హాఫ్ సెంచరీకి తోడు, ధ్రువ్ జురెల్(34), దేవ్‌దత్ పడిక్కల్(27) విధ్వంసంతో సంజూ సేన రెండొందలు కొట్టింది. ఆ తర్వాత బలర్లు చెలరేగడంతో చెన్నైని కట్టడి చేసింది. శివం దూబే(52), మోయిన్ అలీ(23) దంచినా సరిపోలేదు. దాంతో, ధోనీ సేన హ్యాట్రిక్ విజయ యాత్రకు బ్రేక్ పడింది.
కుల్దీప్ వేసిన 20వ ఓవర్లలో చెన్నై విజయానికి 37 రన్స్ కావాలి. ఆఖరి బంతికి శివం దూబే(52) ఔటయ్యాడు. దాంతో, రాజస్థాన్ 32 పరుగుల తేడాతో గెలిచింది. రవీంద్ర జడేజా(21) నాటౌట్‌గా నిలిచాడు.
సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్ గర్జించింది. వరుస ఓటములకు గుడ్ బై చెప్పింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై రెండో విజయం నమోదు చేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(77) హాఫ్ సెంచరీకి తోడు, ధ్రువ్ జురెల్(34), దేవ్‌దత్ పడిక్కల్(27) విధ్వంసంతో సంజూ సేన రెండొందలు కొట్టింది. ఆ తర్వాత బలర్లు చెలరేగడంతో చెన్నైని కట్టడి చేసింది. శివం దూబే(52), మోయిన్ అలీ(23) దంచినా సరిపోలేదు. దాంతో, ధోనీ సేన హ్యాట్రిక్ విజయ యాత్రకు బ్రేక్ పడింది.
కుల్దీప్ వేసిన 20వ ఓవర్లలో చెన్నై విజయానికి 37 రన్స్ కావాలి. ఆఖరి బంతికి శివం దూబే(52) ఔటయ్యాడు. దాంతో, రాజస్థాన్ 32 పరుగుల తేడాతో గెలిచింది. రవీంద్ర జడేజా(21) నాటౌట్‌గా నిలిచాడు.
శివం దూబే(50) ఫిఫ్టీ బాదాడు. సిక్సర్లతో హోరెత్తిస్తున్న అతను 29 బంతుల్లోనే యాభై రన్స్ కొట్టాడు. హోల్డర్ ఓవర్లో సింగిల్ తీసి 50 కి చేరువయ్యాడు. ఆఖరి బంతికి రవీంద్ర జడేజా(21) బౌండరీ బాదాడు. 19 ఓవర్లకు చెన్నై స్కోర్.. 166/5
శివం దూబే(46) సిక్సర్లతో హోరెత్తిస్తున్నాడు. హోల్డర్ ఓవర్లో లాంగాన్‌లో సిక్స్ బాదాడు. ఆ తర్వాత రెండు ఫోర్లు కొట్టాడు. రవీంద్ర జడేజా(4) ఆడుతున్నాడు. 17 ఓవర్లకు చెన్నై స్కోర్.. 145/5
చెన్నై ఐదో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్నమోయిన్ అలీ(23)ని ఆడం జంపా ఔట్ చేశాడు. ఫోర్ కొట్టిన అలీ ఆ తర్వాత బంతికి కీపర్ సంజూ చేతికి చిక్కాడు. దాంతో, 124 వద్ద చెన్నై మరో వికెట్ పడింది. శివం దూబే(29), రవీంద్ర జడేజా(1) ఆడుతున్నారు. దూబే, ఆలీ ఐదో వికెట్‌కు 50 రన్స్ జోడించారు. 15 ఓవర్లకు చెన్నై స్కోర్.. 125/5
మోయిన్ అలీ(19), శివం దూబే(22) దంచుతున్నారు. అశ్విన్ ఓవర్లో దూబే రెండు సిక్స్‌లు కొట్టాడు. దాంతో, చెన్నై స్కోర్ 100 దాటింది. 14 ఓవర్లకు చెన్నై స్కోర్.. 113/4
చెన్నై నాలుగో వికెట్ పడింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అంబటి రాయుడు(0) ఔటయ్యాడు. హోల్డర్ క్యాచ్ పట్టడంతో రాయుడు డకౌటయ్యాడు.
He is on a roll, this @ashwinravi99! 👌 👌
2⃣ wickets in an over for him! 👏 👏#CSK lose Ajinkya Rahane and Ambati Rayudu.
Follow the match ▶️ https://t.co/LoIryJ4ePJ#TATAIPL | #RRvCSK | @rajasthanroyals pic.twitter.com/DIWFpooR68
— IndianPremierLeague (@IPL) April 27, 2023
చెన్నై బిగ్ వికెట్ పడింది. ఫామ్‌లో ఉన్న అజింక్యా రహానే(15) అశ్విన్ ఓవర్లో ఔటయ్యాడు. బౌండరీ వద్ద బట్లర్ క్యాచ్ పట్టడంతో రహానే వెనుదిరిగాడు.
అశ్విన్ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. రుతురాజ్ గైక్వాడ్(47), అజింక్యా రహానే(13) ఆడుతున్నారు. 9 ఓవర్లకు చెన్నై స్కోర్.. 67/1
కుల్దీప్ యాదవ్ ఓవర్లో పరుగులు వచ్చాయి. రుతురాజ్ గైక్వాడ్(46), అజింక్యా రహానే(5) ఆడుతున్నారు. 8 ఓవర్లకు చెన్నై స్కోర్.. 59/1
ఆడం జంపా తొలి వికెట్ తీశాడు. డెవాన్ కాన్వే(8)ను ఔట్ చేశాడు. కాన్వే ఇచ్చిన క్యాచ్‌ను సందీప్ శర్మ అందుకున్నాడు. దాంతో, పవర్ ప్లేలో స్పిన్నర్లను దించిన శాంసన్ ఫలితం రాబట్టాడు. రుతురాజ్ గైక్వాడ్(34), ఆడుతున్నాడు. ఆరు ఓవర్లకు చెన్నై స్కోర్.. 42/1
జేసన్ హోల్డర్ వేసిన నాలుగో ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్(19) ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత బంతిని లెగ్‌సైడ్ సిక్స్ బాదాడు. డెవాన్ కాన్వే(6), ఆడుతున్నాడు. నాలుగు ఓవర్లకు స్కోర్.. 25/0
రాజస్థాన్ పేసర్లు చెన్నై ఓపెనర్లను కట్టడి చేస్తున్నారు. సందీప్ శర్మ వేసిన మూడో ఓవర్లో ఒక్క రన్ వచ్చింది. డెవాన్ కాన్వే(5), రుతురాజ్ గైక్వాడ్(8) ఆడుతున్నారు. 3 ఓవర్లకు స్కోర్.. 13/0
సందీప్ శర్మ వేసిన తొలి ఓవర్లో డెవాన్ కాన్వే(4) బౌండరీ కొట్టాడు. 7 పరుగులు వచ్చాయి. రుతురాజ్ గైక్వాడ్(3) ఆడుతున్నాడు.
మథీశ పథిరన వేసిన 20వ ఓవర్లో ధ్రువ్ జురెల్(34) దంచాడు. తొలి బంతిని సిక్స్‌గా మలిచాడు. రెండో బంతికి థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ బాదాడు. వైడ్ అయిన నాలుగో బంతికి పరుగుకు ప్రయత్నించాడు. ధోనీ తన మార్క్ త్రోతో అతను రనౌటయ్యాడు. ఐదో బంతిని దేవ్‌దత్ పడిక్కల్(27) బౌండరీకి పంపాడు. ఆఖరి బాల్‌కు 3 రన్స్ వచ్చాయి. దాంతో, రాజస్థాన్ 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.
ధ్రువ్ జురెల్(23) స్పీడ్ పెంచాడు. దేశ్‌పాండే ఓవర్లో వరుసగా ఫోర్, లాంగాన్‌లో సిక్స్ కొట్టాడు. దేవ్‌దత్ పడిక్కల్(20) ఆడుతున్నాడు. 19 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్..182/4
దేవ్‌దత్ పడిక్కల్(15)ధనాధన్ ఆడుతున్నాడు. థీక్షణ ఓవర్లో రెండు బౌండరీలు కొట్టాడు. యార్కర్లను తెలివిగా ఫోర్లుగా మలిచాడు. ధ్రువ్ జురెల్(12) ఆడుతున్నారు. 18 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్..166/4
థీక్షణ ఓవర్లో దేవ్‌దత్ పడిక్కల్(5) ఫైన్ లెగ్‌లో బౌండరీ కొట్టాడు. దాంతో, రాజస్థాన్ స్కోర్ 150 దాటింది. ధ్రువ్ జురెల్(9) ఫోర్ బాదాడు. ఆడుతున్నారు. 17 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్..153/4
రాజస్థాన్ నాలుగో వికెట్ పడింది. థీక్షణ ఓవర్లో డేంజరస్ హెట్మెయిర్(8) బౌల్డ్ అయ్యాడు.
మథీశ పథిరన బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్(8) ఫోర్ బాదాడు.హెట్మెయిర్(8) ఆడుతున్నారు. 16 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్..146/1
యశస్వీ జైస్వాల్(61) బాదుతున్నాడు. మోయిన్ అలీ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదాడు. సంజూ శాంసన్(5) డబుల్స్ తీశాడు. దాంతో, రాజస్థాన్ స్కోర్ 100 దాటింది. క్రీజులో ఉన్నాడు. 10 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్..100/1
రవీంద్ర జడేజా బిగ్ వికెట్ తీశాడు. డేంజరస్ జోస్ బట్లర్(27)ను ఔట్ చేశాడు. బట్లర్ గాల్లోకి లేపిన బంతిని మిడాన్‌లో శివం దూబే అందుకున్నాడు. దాంతో, 85 రన్స్ వద్ద రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. యశస్వీ జైస్వాల్(53) క్రీజులో ఉన్నాడు. 8.2 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్.. 85/1
యశస్వీ జైస్వాల్(50) హాఫ్ సెంచరీ కొట్టాడు. జడేజా బౌలింగ్‌లో స్వీప్ షాట్‌తో సిక్స్ కొట్టిన అతను సింగిల్ తీసి యాభ రన్స్ పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 రన్స్ చేశాడు. ఓపెనర్ జోస్ బట్లర్(24) ఆడుతున్నాడు. ఏడు ఓవర్లకు రాజస్థాన్ స్కోర్.. 75/0.
5⃣0⃣ for @ybj_19 in just 26 balls! 👏 👏
His THIRD half-century of the #TATAIPL 2023 👍 👍
Follow the match ▶️ https://t.co/LoIryJ4ePJ#RRvCSK | @rajasthanroyals pic.twitter.com/XyvaBQpVt1
— IndianPremierLeague (@IPL) April 27, 2023
పవర్ ప్లేలో రాజస్థాన్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. థీక్షణ బౌలింగ్‌లో ఓపెనర్ జోస్ బట్లర్(23) రెండు ఫోర్లు కొట్టాడు. యశస్వీ జైస్వాల్(40) ఆడుతున్నాడు. ఆరు ఓవర్లకు రాజస్థాన్ స్కోర్.. 64/0 89 మీటర్ల సిక్స్ బాదాడు.
దేశ్‌పాండే బౌలింగ్‌లో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(39) 89 మీటర్ల సిక్స్ బాదాడు. దాంతో, రాజస్థాన్ స్కోర్ 50 దాటింది. జోస్ బట్లర్(14) ఆడుతున్నాడు. ఐదు ఓవర్లకు రాజస్థాన్ స్కోర్.. 54/0
యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(31) దంచి కొడుతున్నాడు. ఆకాశ్ సింగ్ బౌలింగ్‌లో తొలి బంతికి ఫోర్ కొట్టిన అతను మూడో బంతిని మిడ్ వికెట్ దిశగా స్టాండ్స్‌లోకి పంపాడు. ఐదో, ఆరో బంతుల్నిబౌండరీ బాదాడు. జోస్ బట్లర్(11) ఆడుతున్నాడు. మూడు ఓవర్లకు రాజస్థాన్ స్కోర్.. 42/0
తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో ఓపెనర్ జోస్ బట్లర్(11) తొలి బంతికి, ఐదో బాల్‌కు బౌండరీ కొట్టాడు. యశస్వీ జైస్వాల్(13) ఆడుతున్నాడు. రెండో ఓవర్లకు రాజస్థాన్ స్కోర్.. 24/0
ఓపెనర్ యశస్వీ జైస్వాల్(13) తొలి ఓవర్లోనే రెచ్చిపోయాడు. తొలి రెండు బంతుల్ని బౌండరీ దాటించాడు. నాలుగో బంతికి డీప్ మిడ్ వికెట్లో బౌండరీ కొట్టాడు. దాంతో 14 రన్స్ వచ్చాయి. జోస్ బట్లర్(1) ఆడుతున్నాడు.
చెన్నై సబ్స్టిట్యూట్స్ : అంబటి రాయుడు, డ్వేన్ ప్రిటోరియస్, సుబ్రాన్షు సేనాపతి, షేక్ రషీద్, హంగర్గేకర్.
రాజస్థాన్ సబ్స్టిట్యూట్స్ : డొనవాన్ ఫెరేర, మురుగన్ అశ్విన్, రియాన్ పరాగ్, అసిఫ్, కుల్దీప్ యాదవ్.
The Playing XIs are IN!
What are your thoughts on the two sides today?
Follow the match ▶️ https://t.co/wKHNy124q1 #TATAIPL | #RRvCSK pic.twitter.com/JJpMv7uYvg
— IndianPremierLeague (@IPL) April 27, 2023
రాజస్థాన్ : జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సంజూ శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), హెట్మెయిర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జేసన్ హోల్డర్, ఆడం జంపా, సందీప్ శర్మ, యజువేంద్ర చాహల్.
చెన్నై : డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, శివం దూబే, మోయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, వికెట్ కీపర్), మథీశ పథిరన, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ థీక్షణ.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. దాంతో, ధోనీ సేన మొదట ఫీల్డింగ్ చేయనుంది.
🚨 Toss Update 🚨@rajasthanroyals win the toss and elect to bat first against @ChennaiIPL.
Follow the match ▶️ https://t.co/wKHNy124q1 #TATAIPL | #RRvCSK pic.twitter.com/cOrRDDSaEb
— IndianPremierLeague (@IPL) April 27, 2023