IPL 2023 : పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల నష్టానికి 153 రన్స్ చేసింది. గుజరాత్ ముందు మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. జోష్ లిటిల్ వేసిన 20వ ఓవర్లో హర్‌ప్రీత్ బ్రార్(8) చెలరేగాడు. లాంగాన్‌లో 89 మీటర్ల సిక్స్ కొట్టాడు. షారుక్ ఖాన్(22) రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పంజాబ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. మాథ్యూ షార్ట్(36), జితేశ్ శర్మ(25), సామ్ కరన్(22) మినహా ఎవరూ రాణించలేదు. చివర్లో షారుక్ ఖాన్(22) చెలరేగడంతో పంజాబ్ ఆ మాత్రం సోర్ చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ రెండు, అల్జారీ జోసెఫ్ షమీ, రషీద్ ఖాన్, జోష్ లిటిల్ తలా ఒక వికెట్ తీశారు.
టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్‌కు మొదటి ఓవర్లోనే షమీ షాకిచ్చాడు. రెండో బంతికే ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(0)ను బౌల్డ్ చేశాడు. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదిన శిఖర్ ధావన్(8) తక్కువకే పెవలియన్ చేరాడు. కష్టాల్లో పడిన పంజాబ్‌ను మాథ్యూ షార్ట్(36), భానుక రాజపక్సే(20) ఆదుకున్నారు. దాంతో, పవర్ ప్లేలో పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 52 రన్స్ చేసింది. మూడో వికెట్‌కు విలువైన 25 రన్స్ జోడించారు. అయితే.. రషీద్ ఖాన్ గూగ్లీతో షార్ట్‌ను బోల్తా కొట్టించాడు. జితేశ్ శర్మ(25) ఔటయ్యాక సామ్ కరన్, షారుక్ ధాటిగా ఆడారు.