IPL 2023 : పదహారో సీజన్ ఐపీఎల్లో కొట్టింది తక్కువ స్కోరే.. అయినా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుతం చేసింది. బలమైన లక్నో సూపర్ జెయింట్స్‌పై 18 పరుగుల తేడాతో గెలిచింది. తొలి రౌండ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. స్లో పిచ్‌పై బౌలర్లు చెలరేగడంతో లక్నోను 108కే ఆలౌట్ చేసింది. దాంతో, ఐదో విజయం సాధించి ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపరుచుకుంది.
20వ ఓవర్లో లక్నో విజయానికి 23 రన్స్ కావాలి. అమిత్ మిశ్రా(19) క్యాచ్ ఔటయ్యాడు. దాంతో, లక్నో 108 రన్స్‌కు ఆలౌటయ్యింది. పదో వికెట్‌గా వచ్చిన కేఎల్ రాహుల్(0) నాటౌట్‌గా నిలిచాడు. దాంతో, ఆర్సీబీ 18 పరుగుల తేడాతో గెలిచింది.
లక్నో విజయానికి 20వ ఓవర్లో 23 రన్స్ కావాలి. అమిత్ మిశ్రా(19) క్యాచ్ ఔటయ్యాడు. దాంతో, లక్నో 108 రన్స్‌కు ఆలౌటయ్యింది. పదో వికెట్‌గా వచ్చిన కేఎల్ రాహుల్(0) నాటౌట్‌గా నిలిచాడు. దాంతో, ఆర్సీబీ 18 పరుగుల తేడాతో గెలిచింది.
లక్నో మరింత కష్టాల్లో పడింది. ఎనిమిదో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయ్(5) రనౌటయ్యాడు. అమిత్ మిశ్రా6(), నవీల్ ఉల్ హక్(1) క్రీజులో ఉన్నారు. లక్నో విజయానికి 30 బంతుల్లో 49 రన్స్ కావాలి.
కరన్ శర్మ ఓవర్లో స్టోయినిస్(13) ఔటయ్యాడు. దాంతో లక్నో ఆరో వికెట్ పడింది.
ఆర్సీబీ బౌలర్లు హడలెత్తిస్తున్నారు. కరన్ శర్మ ఓవర్లో నికోలస్ పూరన్(9) ఔటయ్యాడు. బౌండరీ వద్ద లొమ్రోర్ క్యాచ్ పట్టడంతో పూరన్ వెనుదిరిగాడు. దాంతో, 38 రన్స్‌కే లక్నో ఐదు వికెట్లు కోల్పోయింది. స్టోయినిస్(8) ఆడుతున్నాడు.
పవర్ ప్లేలో లక్నో నాలుగు వికెట్లు కోల్పోయి 34 రన్స్ చేసింది. స్టోయినిస్(6), నికోలస్ పూరన్(7) ఆడుతున్నారు.
లక్నో మరో వికెట్ కోల్పోయింది. హసరంగ ఓవర్లో దీపక్ హుడా(1) స్టంపౌటయ్యాడు.
లక్నోకు మరో షాక్ ... ఆయూష్ బదోని(4) ఔటయ్యాడు. హేజిల్‌వుడ్ వేసిన ఊదో ఓవర్లో కోహ్లీ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దాంతో, 21 రన్స్‌కే లక్నో మూడు వికెట్లు కోల్పోయింది. స్టోయినిస్ వచ్చాడు. దీపక్ హుడా(1) ఆడుతున్నాడు.
లక్నోకు షాక్ ... కృనాల్ పాండ్యా(14) ఔటయ్యాడు. మ్యాక్స్‌వెల్ వేసిన నాలుగో ఓవర్లో కోహ్లీ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దీపక్ హుడా వచ్చాడు.
సిరాజ్ వేసిన మూడో ఓవర్లో కృనాల్ పాండ్యా(14) హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. ఆయూష్ బదోని(2) ఆడుతున్నాడు. మూడు ఓవర్లకు లక్నో స్కోర్.. 18/1
సిరాజ్ చెలరేగాడు. రెండో బంతికే డేంజరస్ కైల్ మేయర్స్(0)ను ఔట్ చేశాడు. మేయర్స్ కొట్టిన బంతిని అనుజ్ రావత్ అందుకున్నాడు. దాంతో, ఖాతా తెరవక ముందే లక్నో తొలి వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా వచ్చాడు. యంగ్‌స్టర్ ఆయూష్ బదోనికి ప్రమోషన్ వచ్చింది. గాయంతో మైదానం వీడిన కెప్టెన్ కేఎల్ రాయల్ స్థానంలో అతను ఓపెనర్‌గా వచ్చాడు.
In the air & taken!@mdsirajofficial once again finds an early wicket 🔥🔥
Kyle Mayers departs on the second ball of the innings.
Follow the match ▶️ https://t.co/jbDXvbwuzm #TATAIPL | #LSGvRCB pic.twitter.com/svHkNvG7qr
— IndianPremierLeague (@IPL) May 1, 2023
నవీన్ ఉల్ హక్ వేసిన 20వ ఓవర్లో కరన్ శర్మ(2) క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత సిరాజ్(0) కీపర్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, నవీన్ హ్యాట్రిక్‌పై నిలిచాడు. కానీ, హేజిల్‌వుడ్(1) డిఫెండ్ చేశాడు. ఆఖరి బంతికి వనిందు హసరంగ(8) బౌండరీ కొట్టాడు. దాంతో, ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింద
దినేశ్ కార్తిక్(16) రనౌటయ్యాడు. యశ్ ఠాకూర్ ఓవర్లో వనిందు హసరంగ(2) కొట్టిన బంతికి సింగిల్ తీయబోయాడు. కానీ బంతి అందుకున్న ఠాకూర్ వికెట్లకు గురి చూసి కొట్టాడు. దాంతో, ఆర్సీబీ ఏడో వికెట్ పడింది.
ఆర్సీబీ ఆరో వికెట్ పడింది. నవీన్ ఉల్ హక్ ఓవర్లో మహిపాల్ లొమ్రోర్(3) ఎల్బీగా వెనుదిరిగాడు. వనిందు హసరంగ వచ్చాడు. దినేశ్ కార్తిక్(15) ఆడుతున్నాడు. 18 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్..115/6.
అమిత్ మిశ్రా బిగ్ వికెట్ తీశాడు. ఐదో బంతికి ఫాఫ్ డూప్లెసిస్(44)ను ఔట్ చేశాడు. ఫాఫ్ కొట్టిన బంతిని కృనాల్ పాండ్యా అందుకున్నాడు. దాంతో, ఆర్సీబీ ఐదో వికెట్ పడింది. మహిపాల్ లొమ్రోర్ వచ్చాడు. తొలి బంతికే దినేశ్ కార్తిక్(13) సిక్స్ కొట్టాడు. దాంతో, ఆర్సీబీ స్కోర్ వంద దాటింది. 17 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్..110/5.
ఆట మొదలయ్యాక తొలి బంతికే దినేశ్ కార్తిక్(6) బౌండరీ కొట్టాడు. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(41) ఆడుతున్నారు. 16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్..99/4.
వర్షం తగ్గింది. దాంతో, గ్రౌండ్ సిబ్బంది పిచ్ మీది కవర్లు తొలగించారు. ఇరుజట్ల ఆటగాళ్లు మైదానంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. 15.2 ఓవర్లకు చినుకులు పెద్దగయ్యాయి. దాంతో, అంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు. లక్నో స్పిన్ దెబ్బకు ఆర్సీబీ బ్యాటింగ్ నత్తనడకన సాగుతోంది. దినేశ్ కార్తిక్(1), కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(40) ఆడుతున్నారు. 15.2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్..93/4.
ఆర్సీబీ నాలుగో వికెట్ పడింది. అమిత్ మిశ్రా ఓవర్లో సుయాశ్ ప్రభుదేశాయ్(6) ఔటయ్యాడు. సుయాశ్కొట్టిన బంతిని కృష్ణప్ప గౌతమ్ క్యాచ్ పట్టాడు. దాంతో, 90 రన్స్ వంద నాలుగో వికెట్ పడింది. దినేశ్ కార్తిక్ వచ్చాడు. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(38) ఆడుతున్నాడు.
Remarkable effort! 🙌🏻
K Gowtham dives to his front and grabs a fine catch near the ropes 👌🏻👌🏻#TATAIPL | #LSGvRCB pic.twitter.com/Ju6yzYWDsT
— IndianPremierLeague (@IPL) May 1, 2023
కృష్ణప్ప గౌతమ్ ఓవర్లో పరుగులు వచ్చాయి. అనుజ్ రావత్(1), ఫాఫ్ డూప్లెసిస్(31) ఆడుతున్నారు.10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 65/0.
ఆర్సీబీ బిగ్ వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయ్ ఓవర్లో విరాట్ కోహ్లీ(31) స్టంపౌట్ అయ్యాడు. అనుజ్ రావత్ వచ్చాడు. ఫాఫ్ డూప్లెసిస్(29) ఆడుతున్నాడు.
యశ్ ఠాకూర్ ఓవర్లో విరాట్ కోహ్లీ(29) బౌండరీ కొట్టాడు. దాంతో, 7 పరుగులు వచ్చాయి. ఫాఫ్ డూప్లెసిస్(25) ఆడుతున్నాడు. 8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 56/0.
రవి బిష్ణోయ్ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. ఫాఫ్ డూప్లెసిస్(21), విరాట్ కోహ్లీ(21) ఆడుతున్నారు. ఆరు ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 42/0.
నవీన్ ఉల్ హక్ ఓవర్లో తడబడిన ఫాఫ్ డూప్లెసిస్(18) మూడో బంతికి సిక్స్ బాదాడు. ఐదో బంతికి విరాట్ కోహ్లీ(14) బౌండరీ కొట్టాడు. నాలుగు ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 32/0.
స్టోయినిస్ వేసిన రెండో ఓవర్లో ఫాఫ్ డూప్లెసిస్(9) బతికిపోయాడు. లాంగాన్‌లో నవీన్ ఉల్ హక్ క్యాచ్ మిస్ చేశాడు. ఆఖరి బంతికి డూప్లెసిస్ బౌండరీ కొట్టాడు. విరాట్ కోహ్లీ(7) ఆడుతున్నాడు. రెండు ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 16/0.
కృనాల్ పాండ్యా వేసిన మొదటి ఓవర్లో ... తొలి బంతికే విరాట్ కోహ్లీ(5) బౌండరీ కొట్టాడు. ఓపెనర్ ఫాఫ్ డూప్లెసిస్(0) ఆడుతున్నాడు.
ఆర్సీబీ జట్టు : డూప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్, అనుజ్ రావత్, మహిపాల్ లొమ్రోర్, దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), సుయాశ్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగ, కరన్ శర్మ, సిరాజ్, హేజిల్‌వుడ్.
లక్నో జట్టు : కేఎల్ రాహుల్(కెప్టెన్) కైల్ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, స్టోయినిస్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్.
సబ్స్టిట్యూట్స్ వీళ్లే
ఆర్సీబీ : హర్షల్ పటేల్, షహబాజ్, వైశాక్, బ్రేస్‌వెల్, సోనూ యదవ్.
లక్నో : బదొని, అవేశ్ ఖాన్, డికాక్, ప్రేరక్ మన్కడ్, డానియెల్ సామ్స్.
The Playing XIs are in!
What do you make of the two sides today in the #LSGvRCB clash?
Follow the match ▶️ https://t.co/jbDXvbwuzm #TATAIPL | #LSGvRCB pic.twitter.com/lHzHLLFixG
— IndianPremierLeague (@IPL) May 1, 2023
ఆర్సీబీ జట్టు స్టార్ పేసర్ హేజిల్‌వుడ్ వచ్చేశాడు. షహబాజ్ అహ్మద్ స్థానంలో అనుజ్ రావత్ ఆడనున్నాడు. ఇక లక్నో టీమ్ ఒక మార్పు చేసింది. అవేశ్‌ఖాన్ ప్లేస్‌లో స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్‌ను తీసుకుంది.
ఆర్సీబీ కెప్టెన్ డూప్లెసిస్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. దాంతో లక్నో జట్టు మొదట ఫీల్డింగ్ చేయనుంది.
🚨 Toss Update 🚨@RCBTweets win the toss and elect to bat first against @LucknowIPL.
Follow the match ▶️ https://t.co/jbDXvbwuzm #TATAIPL | #LSGvRCB pic.twitter.com/6t6Bs18AH8
— IndianPremierLeague (@IPL) May 1, 2023