IPL 2023 : ఐపీఎల్ పదహారో సీజన్లో మన కుర్రాళ్లు చెలరేగి ఆడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో విదేశీ ఆటగాళ్ల కంటే భారత క్రికెటర్లే అదరగొట్టారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ బ్యాటింగ్‌లో దంచి కొడుతున్నారు. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ఔరా అనిపిస్తున్నారు. వీళ్లు క్రీజులో ఉంటే చాలు కొండంత లక్ష్యమైన కరిగిపోతుంది. స్వల్ప టార్గెట్‌ను కాపాడుకోవడంలో, సరైన సమయంలో వికెట్లు తీయడంలో యంగ్ బౌలర్లు సత్తా చాటుతున్నారు.
ఈ ఏడాది ఇరానీ కప్‌లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన యశస్వీ జోరు కొనసాగిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లోనే ఫిఫ్టీ కొట్టిన అతను ఐపీఎల్లో తొలి సెంచరీ బాదాడు. ముంబై ఇండియన్స్‌పై వీరవిహారం చేసిన అతను 120 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 11 మ్యాచుల్లో 43.36 సగటుతో 477 రన్స్ కొట్టాడు. ఇక రింకూ సింగ్ అయితే.. ఐదు సిక్సర్లతో ఎంతో పాపులర్ అయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌పై ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు బంతులకు ఐదు సిక్స్‌లు కొట్టి కోల్‌కతాను గెలిపించాడు. పంజాబ్ కింగ్స్‌పై ఆఖరి బంతికి ఫోర్ బాది తానేంటో మరోసారి నిరూపించాడు. కోల్‌కతా మ్యాచ్ విన్నర్‌గా పేరొందని ఇతను 151.1 స్ట్రైక్ రేటుతో 337 రన్స్ సాధించాడు.
యంగ్‌స్టర్ ఇషాన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ధనాధన్ ఆడిన అతను పంజాబ్ కింగ్స్‌పై హాఫ్ సెంచరీ కొట్టి జట్టును గెలిపించాడు. శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహాతో కలిసి గుజరాత్‌కు శుభారంభాలు ఇస్తున్నాడు. లక్నోపై దంచిన అతను 94 పరుగులు చేశాడు. ఈ యంగ్‌స్టర్ 11 ఇన్నింగ్స్‌లో 143.42 స్ట్రైక్ రేటుతో 469 రన్స్ కొట్టాడు.
స్వల్ప టార్గెట్‌ను కాపాడుకోవడంలో, సరైన సమయంలో వికెట్లు తీయడంలో యంగ్ బౌలర్లు సత్తా చాటుతున్నారు. తుషార్ దేశ్‌పాండే(చెన్నై సూపర్ కింగ్స్), రవి బిష్ణోయ్(లక్నో సూపర్ జెయింట్స్), సుయాశ్ శర్మ(కోల్‌కతా నైట్ రైడర్స్), మయాంక్ మార్కండే(సన్ రైజర్స్ హైదరాబాద్), అక్షర్ పటేల్(ఢిల్లీ క్యాపిటల్స్) బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. కీలక సమయంలో వికెట్లు తీసి జట్టు విజయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చెన్నై ఓపెనింగ్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే 19 వికెట్లు తీశాడు. బిష్ణోయ్ ఇప్పటికే 12 వికెట్లు తీశాడు.
వరుణ్ చక్రవర్తి, మయాంక్ మార్కండే, రవి బిష్ణోయ్
హైదరాబాద్ స్పిన్ విభాగంలో మార్కండే కీలకంగా మారాడు. అతడి ఖాతాలో 11 వికెట్లు ఉన్నాయి. అక్షర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బ్యాటుతో, బంతితో రాణిస్తూ ఢిల్లీకి అండగా నిలుస్తున్నాడు. కోల్‌కతాకు వెన్నెముకలా నిలుస్తున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 17 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో కోల్‌కతా తరఫున ఆరంగేట్రం చేసిన సుయాశ్ శర్మ ఔరా అనిపిస్తున్నాడు. . తొలి మ్యాచ్‌లోనే ఈ యంగ్‌స్టర్ ఆర్సబీపై మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఇప్పటి వరకు అతను 10 వికెట్లు తీశాడు