IPL 2023 : సొంత గ్రౌండ్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings ) చెలరేగి ఆడింది. ఆల్‌రౌండ్ షోతో ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. పదోసారి టైటిల్ పోరుకు సిద్ధమైంది. క్వాలిఫైయర్ 1 గేమ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)పై 15 పరుగులతో తేడాతో విజయం సాధించింది. మొదట ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(60 : 44 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో, చెన్నై 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో స్పిన్నర్లు జడేజా, థీక్షణ చెలరేగడంతో గుజరాత్ 157 రన్స్‌కే ఆలౌటయ్యింది. హార్దిక్ పాండ్యా సేన ఫైనల్ బెర్తు కోసం ఎలిమినేటర్ విజేతతో తలపడనుంది.
పథిరన వేసిన 20వ ఓవర్లో గుజరాత్ విజయానికి 27 రన్స్ కావాలి. నాలుగో బంతికి నూర్ అహ్మద్(7) ఫోర్ కొట్టాడు. ఆఖరి బంతకి షమీ(5) ఔటయ్యాడు. దాంతో గుజరాత్ 157 పరుగులకు ఆలౌటయ్యింది. 15 పరుగులతో విజయం సాధించిన ధోనీ సేన పదోసారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది.
గుజరాత్ ఆలౌట్ ప్రమాదంలో పడింది. దంచుతున్న రషీద్ ఖాన్(30) ఔటయ్యాడు. తుషార్ దేశ్‌పాండే ఓవర్లో కాన్వే క్యాచ్ పట్టడంతో రషీద్ వెనుదిరిగాడు. షమీ వచ్చాడు.
గుజరాత్ ఎనిమిదో వికెట్ పడింది. పథిరన ఓవర్లో నాలుగో బంతికి దర్శన్ నల్కండే(0) రనౌటయ్యాడు. సుభాన్షు సేనాపతి డైరెక్ట్ త్రో విసరడంతో అతను వెనుదిరిగాడు. రషీద్ ఖాన్(26) క్రీజులో ఉన్నాడు.
పథిరన ఓవర్లో ఇంపాక్ల్ ప్లేయర్ విజయ్ శంకర్(14) ఔటయ్యాడు. శంకర్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద రుతురాజ్ గైక్వాడ్ డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు. రషీద్ ఖాన్(26) క్రీజులో ఉన్నాడు.
తుషార్ దేశ్‌పాండే ఓవర్లో ఇంపాక్ల్ ప్లేయర్ విజయ్ శంకర్(13) తొలి బంతికి సిక్స్ బాదాడు. నాలుగో బంతికి లాంగాన్‌లో రషీద్ ఖాన్(25) సిక్స్ కొట్టాడు. ఐదో బంతికి ఫోర్ బాదాడు. 19 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లకు స్కోర్.. 134/6
పథిరన ఓవర్లో రషీద్ ఖాన్(15) సిక్స్, ఫోర్ బాదాడు. 13 పరుగులు వచ్చాయి. ఇంపాక్ల్ ప్లేయర్ విజయ్ శంకర్(6) క్రీజులో ఉన్నారు. 16 ఓవర్లకు స్కోర్.. 115/6
గుజరాత్ మరింత కష్టాల్లో పడింది. మహీష్ థీక్షణ ఓవర్లో రాహుల్ తెవాటియా(3) బౌల్డయ్యాడు. దాంతో, 98 రన్స్ వద్ద గుజరాత్ ఆరో వికెట్ పడింది. రషీద్ ఖాన్(3)ఇంపాక్ల్ ప్లేయర్ విజయ్ శంకర్(5) క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లకు స్కోర్.. 102/6
గుజరాత్ ఐదో వికెట్ పడింది. దీపక్ చాహర్ ఓవర్లో శుభ్‌మన్ గిల్(42) ఔటయ్యాడు. గిల్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద కాన్వే అద్భుత క్యాచ్ పట్టాడు. దాంతో, 88 వద్ద గుజరాత్ కీలక వికెట్ కోల్పోయింది. రాహుల్ తెవాటియా వచ్చాడు. ఇంపాక్ల్ ప్లేయర్ విజయ్ శంకర్(0) క్రీజులో ఉన్నాడు.
రవీంద్ర జడేజా తన ఆఖరి ఓవర్లో మరో బిగ్ వికెట్ తీశాడు. డేవిడ్ మిల్లర్(4)ను ఐదో బంతికి బౌల్డ్ చేశాడు. శుభ్‌మన్ గిల్(42) ఆడుతున్నాడు.
మథీశ పథిరన 4 వైడ్స్ వేశాడు. 10 రన్స్ వచ్చాయి. డేవిడ్ మిల్లర్(2) శుభ్‌మన్ గిల్(40) ఆడుతున్నారు. 12 ఓవర్లకు స్కోర్.. 84/3
రవీంద్ర జడేజా బిగ్ వికెట్ తీశాడు. అతని ఓవర్లో దసున్ శనక(17) ఔటయ్యాడు. రివర్స్ స్వీప్ ఆడాలనుకున్న శనక, థీక్షణ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దాంతో, 72 వద్ద గుజరాత్ మూడో వికెట్ పడింది. డేవిడ్ మిల్లర్ వచ్చాడు. శుభ్‌మన్ గిల్(34) ఆడుతున్నాడు.
శుభ్‌మన్ గిల్(27) దూకుడుగా ఆడుతున్నాడు. రవీంద్ర జడేజా ఓవర్లో ఆఖరి బంతికి బౌండరీ బాదాడు. 7 రన్స్ వచ్చాయి. దసున్ శనక(4) క్రీజులో ఉన్నాడు. 9 ఓవర్లకు స్కోర్.. 59/2
మహీష్ థీక్షణ ఓవర్లో 6 రన్స్ వచ్చాయి. దసున్ శనక(4) శుభ్‌మన్ గిల్(27) క్రీజులో ఉన్నారు. 8 ఓవర్లకు స్కోర్.. 52/2
గుజరాత్ కీలక వికెట్ పడింది. మహీష్ థీక్షణ ఓవర్లో హార్దిక్ పాండ్యా(8) ఔటయ్యాడు. షాట్ ఆడబోయిన పాండ్యా జడేజా చేతికి చిక్కాడు. దాంతో, 41రన్స్ వద్ద గుజరాత్ రెండో వికెట్ పడింది. దసున్ శనక వచ్చాడు. శుభ్‌మన్ గిల్(20) క్రీజులో ఉన్నాడు. 6 ఓవర్లకు స్కోర్.. 41/2
మూడో స్థానంలో వచ్చిన హార్దిక్ పాండ్యా(5 ) ఫోర్ కొట్టాడు. శుభ్‌మన్ గిల్(14) బౌండరీ బాదాడు. 10 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు స్కోర్.. 32/1
దీపక్ చాహర్ తొలి తొలి వికెట్ తీశాడు. వృద్ధిమాన్ సాహా( 12)ను ఔట్ చేశాడు. ఐదో బంతికి బౌండరీ కొట్టిన సాహా, ఆఖరి బాల్‌కు షాట్ ఆడాడు. బౌండరీ వద్ద పథిరన క్యాచ్ పట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు. శుభ్‌మన్ గిల్(9) క్రీజులో ఉన్నాడు. 3 ఓవర్లకు స్కోర్.. 22/1
తుషార్ దేశ్‌పాండే ఓవర్లో శుభ్‌మన్ గిల్(2)కు లైఫ్ దొరికింది. దీపక్ చాహర్ క్యాచ్ జారవిడిచాడు. ఆఖరి బంతికి వృద్ధిమాన్ సాహా( 7) బౌండరీ కొట్టాడు. ఆడుతున్నారు. రెండు ఓవర్లకు స్కోర్.. 9/0
దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్లో 3 రన్స్ వచ్చాయి. శుభ్‌మన్ గిల్(1), వృద్ధిమాన్ సాహా( 2) ఆడుతున్నారు.
షమీ వేసిన 20వ ఓవర్లో రవీంద్ర జడేజా(22) తొలి బంతికి బౌండరీ కొట్టాడు. మూడో బంతికి మోయిన్ అలీ(9 నాటౌట్) మిడ్ వికెట్లో సిక్స్ కొట్టాడు. ఫ్రీ హిట్‌కు సింగిల్ వచ్చింది. ఆఖరి బంతికి భారీ షాట్ ఆడబోయిన జడేజా బౌల్డ్ అయ్యాడు. దాంతో, చెన్నై 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
మోహిత్ శర్మ కీలక వికెట్ తీశాడు. ఎంఎస్ ధోనీ(1)ను ఔట్ చేశాడు. షాట్ ఆడిన ధోనీ కవర్స్‌లో పాండ్యా చేతికి చిక్కాడు. దాంతో, చెన్నై ఆరో వికెట్ పడింది. రవీంద్ర జడేజా(16), మోయిన్ అలీ(2) ఆడుతున్నారు. 19 ఓవర్లకు స్కోర్..157/6
చెన్నై సగం వికెట్లు కోల్పోయింది. రషీద్ ఖాన్, ఓవర్లో అంబటి రాయుడు(17) ఔటయ్యాడు. ఐదో బంతికి సిక్స్ బాదిన అతను ఆరో బంతికి శనక క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా(10) క్రీజులో ఉన్నాడు. 18 ఓవర్లకు స్కోర్..148/5
షమీ బిగ్ వికెట్ తీశాడు. డేంజరస్ డెవాన్ కాన్వే(40)ను ఔట్ చేశాడు. భారీ షాట్ ఆడిన కాన్వే బౌండరీ వద్ద రషీద్ చేతికి చిక్కాడు. దాంతో, 125 రన్స్ వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా వచ్చాడు.
దూకుడుగా ఆడే క్రమంలో అజింక్యా రహానే(17) ఔటయ్యాడు. దర్శన్ నల్కండే ఓవర్లో సిక్స్ కొట్టిన అతను ఆ తర్వాత బంతికి స్లిప్‌లో గిల్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన అంబటి రాయుడు(4) బౌండరీ కొట్టాడు. డెవాన్ కాన్వే(40) క్రీజులో ఉన్నాడు. 15 ఓవర్లకు స్కోర్..125/3
చెన్నైస్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. హాఫ్ సెంచరీ బాదిన రుతురాజ్ గైక్వాడ్(60), సిక్సర్ల శివం దూబే(1) ఔటయ్యారు. అజింక్యా రహానే(8), డెవాన్ కాన్వే(35) క్రీజులో ఉన్నారు. 13 ఓవర్లకు స్కోర్..107/2
ఫామ్‌లో ఉన్న డెవాన్ కాన్వే(23) జోరు పెంచాడు. నూర్ అహ్మద్ ఓవర్లో బౌండరీ కొట్టాడు. 9 పరుగులు వచ్చాయి. రుతురాజ్ గైక్వాడ్(59) ఆడుతున్నాడు. 10 ఓవర్లకు స్కోర్..85/0
ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(50) హాఫ్ సెంచరీ బాదాడు. మోహిత్ శర్మ ఓవర్లో బౌండరీతో అతను ఫిఫ్టీ సాధించాడు. 36 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో అతను అర్ధ శతకానికి చేరువయ్యాడు. ఈ సీజన్లో అతడికి ఇది నాలుగో ఫిఫ్టీ.
స్పిన్నర్ల రాకతో చెన్నై స్కోర్ వేగం తగ్గింది. నూర్ అహ్మద్ ఓవర్లో 6 పరుగులు వచ్చాయంతే. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(46), డెవాన్ కాన్వే(16) ఆడుతున్నారు. 8 ఓవర్లకు స్కోర్..64/0
చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(33) దంచుతున్నాడు. నూర్ అహ్మద్ ఓవర్లో తొలి బంతికి ఫోర్ కొట్టాడు. నాలుగో బంతికి డెవాన్ కాన్వే(14) బౌండరీ బాదాడు. 9 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు స్కోర్..49/0
చెన్నై ఓపెనర్లు ఆచితూచి ఆడుతున్నారు. రషీద్ ఖాన్ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్(28) ఫోర్ కొట్టాడు. 9 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి డెవాన్ కాన్వే(10) ఆడుతున్నాడు. 4 ఓవర్లకు స్కోర్.. 40/0
ఈసీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న దర్శన్ నల్కండే సూపర్ బౌలింగ్ చేస్తున్నాడు. అయితే ఆఖరి బంతికి డెవాన్ కాన్వే(10) ఫోర్ కొట్టాడు. 8 పరుగులు వచ్చాయి. రుతురాజ్ గైక్వాడ్(19) ఆడుతున్నాడు. మూడు ఓవర్లకు స్కోర్..31/0
షమీ వేసిన మూడో ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్(18) ఫోర్ కొట్టాడు. 5 పరుగులు వచ్చాయి. డెవాన్ కాన్వే(3) ఆడుతున్నాడు. రెండు ఓవర్లకు స్కోర్.. 23/0
రెండో ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్(14) ఔటయ్యేవాడే. కానీ, దర్శన్ నల్కండే నో బాల్ వేయడంతో బతికిపోయాడు. ఫ్రీ హిట్‌ను అతను స్టాండ్స్‌లోకి పంపాడు. ఆ తర్వాత బంతికి ఫోర్ బాదాడు. 14 పరుగులు వచ్చాయి. డెవాన్ కాన్వే(2) ఆడుతున్నాడు. రెండు ఓవర్లకు స్కోర్.. 18/0
షమీ తొలి ఓవర్లో చెన్నై ఓపెనర్లకు ఏమాత్రంఅవకాశం ఇవ్వలేదు. కేవలం 4 రన్స్ వచ్చాయంతే. రుతురాజ్ గైక్వాడ్(3), డెవాన్ కాన్వే(1) ఆడుతున్నారు.
చెన్నై - మథీశ పథిరన, మిచెల్ శాంట్నర్, సుభాన్షు సేనాపతి, షేక్ రషీద్, అకాశ్ సింగ్.
గుజరాత్ - విజయ్ శంకర్, శ్రీకర్ భరత్, రవిశ్రీనివాసన్ సాయి కిశోర్, జయంత్ యాదవ్, శివం మావి.
చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివం దూబే, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహీష్ థీక్షణ.
గుజరాత్ : శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దసున్ శనక, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, షమీ.
The Playing XIs are IN!
What are your thoughts on the two sides for #Qualifier1?
Follow the match ▶️ https://t.co/LRYaj7cLY9#TATAIPL | #GTvCSK pic.twitter.com/yXcivEGKdu
— IndianPremierLeague (@IPL) May 23, 2023
టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది.