న్యూఢిల్లీ: ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ (DC), చెన్నై సూపర్‌కింగ్స్ (CSK) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బాగా పొడిగా ఉన్నదని, దానికితోడు 41 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతతో ఎండ కూడా బాగా ఉన్నదని, కాబట్టి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉందని, అందుకే బ్యాటింగ్ ఎంచుకుంటున్నానని ధోనీ చెప్పాడు.
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్: రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే, అజింక్య రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్, కెప్టెన్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహీవ్ తీక్షణ.
ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), రిలీ రొసౌ, యశ్ ధుల్, అమయ హకీం ఖాన్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, ఎన్రిచ్ నోట్జే.