INDvsAUS Live: భారత్ – ఆసీస్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ అట్టహాసంగా మొదలైంది. నరేంద్ర మోడీ స్టేడియం మొత్తం నీలి సముద్రమయమైంది. దేశం మొత్తం ఈ మ్యాచ్ ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ఓ సెంటిమెంట్ భారత్‌కు అనుకూలంగా వచ్చింది. అది ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడటమే. అదెలా అంటే..!
13వ ఎడిషన్‌గా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌కు ఇది నాలుగో ఫైనల్. 1983, 2003, 2011, 2023లలో టీమిండియా ఫైనల్ చేరింది. ఈ నాలుగు పర్యాయాలలో టీమిండియా రెండుసార్లు టీమిండియా టాస్ ఓడినా కప్ కొట్టింది. భారత్ తొలిసారి వరల్డ్ కప్ గెలిచిన 1983లో కపిల్ సేన తొలుత టాస్ ఓడింది. కానీ ఫైనల్లో నాటి అరవీర భయంకర విండీస్‌ను ఓడించింది. 2003లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచింది. కాఈన ఆసీస్ చేతిలో ఘోర వైఫల్యం చెందింది.
1983 – India lost the toss and won the Final.
2011 – India lost the toss and won the Final.
2023 – India lost the toss…!!! pic.twitter.com/sxfC2x40Ge
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 19, 2023
మళ్లీ 2011లో ఫైనల్ చేరిన ధోనీ సేన.. శ్రీలంకను ఓడించి భారత్‌కు రెండో వరల్డ్ కప్ అందించింది. మరి ఇప్పుడూ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..? ఎందుకంటే అహ్మదాబాద్‌లో కూడా టీమిండియా సారథి రోహిత్ శర్మ టాస్ ఓడాడు. సెంటిమెంట్ వర్కవుట్ అయితే అంతకంటే కావాల్సిందేముంది..? ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే చాలని టీమిండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.