IND vs ENG 4th Test : రసవత్తరంగా సాగుతున్న రాంచీ టెస్టులో టీమిండియా(Team India) పట్టుబిగించంది. సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లు విజృంభించడంతో ఇంగ్లండ్ జట్టును 145 పరగులకే ఆలౌట్ చేసింది. టీమిండియా విజయానికి 192 రన్స్ కావాలంతే. కొరకరాని కొయ్యలా మారిన బెన్ ఫోక్స్(17)ను అశ్విన్ రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేశాడు.
ఆ తర్వాతి బంతికే జేమ్స్ అండర్స్‌న్(0) జురెల్ చేతికి చిక్కాడు. దాంతో, మూడో రోజు మరో మూడు ఓవర్లు ఉందనగా బెన్ స్టోక్స్ సేన ఇన్నింగ్స్ ముగిసింది. తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్‌ను కూల్చిన అశ్విన్ కెరీర్లో 35వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
Innings Break!
Outstanding bowling display from #TeamIndia 👌 👌
5️⃣ wickets for @ashwinravi99
4️⃣ wickets for @imkuldeep18
1️⃣ wicket for @imjadejaTarget 🎯 for India – 192
Scorecard ▶️ https://t.co/FUbQ3Mhpq9 #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/kpKvzoWV0p
— BCCI (@BCCI) February 25, 2024
కెరీర్లో రెండు టెస్టు ఆడుతున్న ధ్రువ్ జురెల్(90) హాఫ్ సెంచరీతో భారత్‌ను పోటీలో నిలిపాడు. కుల్దీప్ యాదవ్(28), ఆకాశ్ దీప్(9) లతో కలిసి స్కోర్ 307 పరుగులు దాటించాడు. అనంతరం బౌలింగ్‌కు దిగిన బౌలర్లు జురెల్ పోరాటాన్ని వృథా చేయలేదు.
ధ్రువ్ జురెల్(90)
అశ్విన్ తొలి మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టగా.. ఆ తర్వాత చైనామన్ కుల్దీప్ యాదవ్ స్టోక్స్ సేన నడ్డి విరిచాడు. టీ ముందు డేంజరస్ జాక్ క్రాలే(60 91 బంతుల్లో 7 ఫోర్లు), కెప్టెన్ బెన్ స్టోక్స్(4)ను బౌల్డ్ చేశాడు. దాంతో, ఇంగ్లండ్ 120 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఆలౌట్ ప్రమాదంలో పడింది.
3⃣ quick wickets right after the Tea Break! 👏 👏
Ravindra Jadeja and Kuldeep Yadav sharing the spoils. 👌 👌
England 8 down.
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9 #TeamIndia | #INDvENG | @imjadeja | @imkuldeep18 | @IDFCFIRSTBank pic.twitter.com/XNgJlOLBgt
— BCCI (@BCCI) February 25, 2024
జానీ బెయిర్‌స్టో(30 నాటౌట్ 41 బంతుల్లో 3 ఫోర్లు)ను జడేజా ఔట్ చేశాడు. దాంతో.. అప్పటివరకూ 110/3 తో పటిష్ట స్థితిలో నిలిచిన ఇంగ్లండ్ 31 బంతుల్లోనే 120/6 తో కష్టాల్లో పడింది. అయితే.. తర్వాత బెన్ ఫోక్స్(17), టామ్ హర్ట్లే(7)లు పోరాడి ఏడో వికెట్‌కు 13 పరగులు జోడించారు. అనంతరం ఫోక్స్, బషీర్‌లు 13 ఓవర్లు భారత బౌలర్లను విసిగించారు. కానీ, అశ్విన్ తన మార్క్ బౌలింగ్‌తో చివరి రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.