బెల్గ్రేడ్: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్ అంతిమ్ పంగల్ కాంస్య పతకం సాధించింది. తద్వారా వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ బెర్త్ ఖాతాలో వేసుకుంది.
మహిళల 53 కేజీల విభాగంలో బరిలోకి దిగిన 19 ఏండ్ల అంతిమ్ గురువారం కాంస్య పతక పోరులో 16-6 తేడాతో ఎమ్మా జోనా (స్వీడన్)పై గెలుపొందింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి పతకం నెగ్గిన ఆరో భారత మహిళా రెజ్లర్‌గా చరిత్రకెక్కిన అంతిమ్.. మన దేశంలో నుంచి పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న తొలి రెజ్లర్‌గా నిలిచింది.