న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే-ఆఫ్ పోరులో భారత్ విజృంభించింది. డెన్మార్క్‌తో శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన మనవాళ్లు.. శనివారం కూడా అదే జోరు కొనసాగించడంతో భారత్ 4-0తో విజయం సాధించింది. డబుల్స్‌లో రోహన్ బోపన్న-దివిజ్ శరణ్ జోడీ 6-7 (4/7), 6-4, 7-6 (7/4)తో జొహన్నెస్ ఇంగిల్సెన్-ఫ్రెడెరిక్ నీల్సన్ జంటపై గెలుపొందింది. గంటా 58 నిమిషాల పాటు సాగిన పోరులో భారత జోడీ మూడు మ్యాచ్ పాయింట్లను కాచుకోవడం విశేషం. అనంతరం రివర్స్ సింగిల్స్ పోరులో రామ్‌కుమార్ నెగ్గాడు.