దోహా: భారత స్టార్ క్యూయిస్టు పంకజ్ అద్వానీ తనకు తిరుగులేదని మరోమారు నిరూపించాడు. ఆదివారం జరిగిన ఏషియన్ బిలియర్డ్స్ టోర్నీలో అద్వానీ తన టైటిల్‌ను తిరిగి నిలబెట్టుకున్నాడు.
100-అప్ ఫార్మాట్లో జరిగిన తుది పోరులో అద్వానీ 5-1 తేడాతో భారత్‌కే చెందిన బ్రిజేష్ దమానీపై అద్భుత విజయం సాధించాడు. ఇప్పటికే లెక్కకు మిక్కిలి ట్రోఫీలు సాధించిన పంకజ్..స్నూకర్, బిలియర్డ్స్‌లో కలిపి 25 సార్లు ప్రపంచ విజేతగా నిలిచాడు.