Divanshi | లిమా (పెరూ): ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ స్వర్ణ పతకాల పంట పండిస్తోంది. శనివారం జరిగిన 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టోల్ ఈవెంట్లో దివాన్షి స్వర్ణం గెలిచింది. ఫైనల్లో దివాన్షి 600 పాయింట్లకు గాను 564 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో ఆమెకు ఇది రెండో స్వర్ణం. భారత్‌కే చెందిన పరిషా గుప్త (559) రజతం సాధించగా మాన్వి జైన్ (557) కాంస్యం దక్కించుకుంది. దీంతో ఈ ఈవెంట్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేయడం విశేషం. ఇదే పోటీ పురుషుల విభాగంలో సూరజ్ శర్మ 571 పాయింట్లతో స్వర్ణం సాధించగా ముకేశ్ (568)కు కాంస్యం దక్కింది.