జాగ్రెబ్ (క్రొయేషియా): వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత పోరాటం ముగిసింది. శనివారం జరిగిన గ్రీకో రోమన్ విభాగంలో ముగ్గురు భారత రెజ్లర్లు ఆరంభ రౌండ్లలోనే వెనుదిరిగారు.
సన్నీ కుమార్ (63 కిలోలు), అనిల్ (67 కి.), కరణ్ కంబోజ్ (87 కి.) విఫలమయ్యారు. ఈ టోర్నీలో అంతిమ్ పంగాల్ (మహిళల 53 కి.) ఒక్కతే కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే.